పల్నాడు హాట్ సీట్‌లో ఓటర్లు ఎటువైపు?

Sattenapalli Assembly constituency roundup, YCP, TDP, Janasena, Congress, Chandrababu, Kanna Laxmi Narayana, Ambati Rambabu,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu, Mango News
Sattenapalli Assembly constituency roundup,YCP,TDP,Janasena,Congress, Chandrababu,Kanna Laxmi Narayana, Anmbati Rambabu

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీల నేతల్లో గుబులు మొదలయింది. ఏ నియోజకవర్గం ప్రజలు ఎటువైపు.. ఏ ఓటరు ఏ నాయకుడికి ఓటేస్తాడనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అలా  పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గం గురించి కూడా వార్తల్లో నిలుస్తోంది.

నరసరావుపేట లోకసభ పరిధిలోకి వచ్చే జనరల్ నియోజకవర్గం.. సత్తెనపల్లి. రాజుపాలెం, సత్తెనపల్లి, నకరేకల్, ముప్పాళ్ల మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంటాయి.ఈ నియోజకవర్గంలో మొత్తం 2,30,743 మంది ఓటర్లు ఉన్నారు. సంఖ్యా పరంగా చూస్తే.. కమ్మ సామాజిక వర్గం తర్వాత ముస్లిం,ఎస్సీలు ఉంటారు. ఆ తర్వాత కాపు, రెడ్డి, వైశ్య, యాదవ సామాజిక వర్గాల ఓటుబ్యాంకు ఎక్కువగా ఉంటుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎప్పుడూ కమ్మ, రెడ్డి, కాపు కులాలు మధ్యే ఎక్కుక పోటీ నెలకొంటూ ఉంటుంది. ఈ మూడు సామాజిక వర్గాల నాయకులే ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో పోటీ పడ్డారు. 1952 నుంచి 2019 వరకు 15 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే నాలుగుసార్లు కూడా గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్యనే విజయం వరించింది.  మూడుసార్లు ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా కూడా ఓటర్లు ఆయన వైపే ఉన్నారు. ఇంకోసారి  సీపీఐ అభ్యర్ధిగా బరిలోకి దిగినా ఆయనకే విజయాన్ని అందించారు.

టీడీపీ  ఆవిర్భవించక ముందు ఆరు సార్లు ఎన్నికలు జరిగితే.. నాలుగు సార్లు వావిలాల గెలవగా..మరో రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థి సత్తెనపల్లి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీ ఆవిర్భవించిన తరువాత తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ, కాంగ్రెస్ మూడుసార్లు చొప్పున, సీపీఎం, వైసీపీ గెలిచాయి.

2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో దిగిన  యర్రం వెంకటేశ్వరరెడ్డి.. టీడీపీ తరఫున పోటీ చేసిన నిమ్మకాయల రాజనారాయణ మీద 7,147 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. 2014లో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి డాక్టర్ కోడెల శివప్రసాద్.. వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన అంబటి రాంబాబు మీద 924 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు.

2019లో జరిగిన ఎన్నికలలో కూడా  కోడెల శివప్రసాద్, అంబటి రాంబాబు మధ్యే పోటీ నెలకొంది. కోడెల శివప్రసాద్‌పై 20,876 ఓట్ల భారీ మెజారిటీతో  అంబటి రాంబాబు గెలిచారు. అయితే ఈసారి జరగనున్న ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణకు టికెట్ కన్ఫమ్ అయినా.. వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబుకే మళ్లీ టికెట్ దక్కొచ్చనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. అయితే అటు కన్నా, ఇటు అంబటి రాంబాబు ఇద్దరూ కాపు సామాజిక వర్గ నాయకులే కావడం ఇప్పుడు ఆసక్తికరంగా  మారింది. కమ్మ, రెడ్డి ఓట్లను ఈ రెండు పార్టీలు సగం సగం పంచుకుంటే.. మిగిలిన కాపు ఓట్లతో పాటు ఇతర కులాల ఓట్లు పడేదాని బట్టే ఇక్కడి అభ్యర్థి గెలుపోటములను డిసైడ్ అవుతాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − three =