విద్యా సంస్థలకు జనవరి 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

All Educational Institutions in State to Declare Holidays from Jan 8 to 16th, CM KCR Directed All Educational Institutions, CM KCR Directed All Educational Institutions in State to Declare Holidays, CM KCR Directed All Educational Institutions in State to Declare Holidays from Jan 8 to 16th, Holidays Be Declared At All Educational Institutes, Mango News, Schools colleges to remain shut in Telangana, Telangana CM declare holidays at all educational institutes, Telangana CM K Chandrasekhar Rao, Telangana declares holidays for all educational institutes, Telangana Holidays declared for all educational institutions, Telangana schools to remain closed, Telangana schools to remain closed from Jan 8 to 16

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నాడు వైద్య, ఆరోగ్య శాఖపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో స్కూల్స్, కాలేజీల విద్యార్థులకు 9 రోజుల పాటు సంక్రాంతి సెలవులు రానున్నాయి.

మరోవైపు ఈ సమీక్షలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే పరిస్థితులు లేవని సీఎం కేసీఆర్ కు వైద్యశాఖ అధికారులు నివేదించారు. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లో గుంపులు గుంపులుగా ఉండరాదని, రాష్ట్రంలో కరోనా ప్రబలే ప్రమాదం వున్నందున, బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఎంకు వైద్యాధికారులు నివేదిక అందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =