పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన టీ టైమ్ వ్యవస్థాపకుడు

Tea Time Founder Tangella Uday Srinivas Joins Janasena in the Presence of Pawan Kalyan, Tea Time Founder Tangella Uday Srinivas Joins Janasena, in the Presence of Pawan Kalyan Tea Time Founder Tangella Uday Srinivas Joins Janasena, Tea Time Founder, Tea Time Founder Joins Janasena, Janasena, Time Founder Tangella Uday Srinivas, Time Founder, Tangella Uday Srinivas, Time Founder Joins Janasena, Tangella Uday Srinivas Joins Janasena, Janasena Party, Janasena Party Chief Pawan Kalyan, Pawan Kalyan, Janasena Party Latest News, Janasena Party Latest Updates, Janasena Party Live Updates, Mango News, Mango News Telugu,

తూర్పు గోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీ టైమ్ అవుట్ లెట్ల వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని పార్టీ కేంద్రకార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉదయ్ శ్రీనివాస్ కు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “ఉదయ్ శ్రీనివాస్ గోదావరి జిల్లాకు చెందిన యువ పారిశ్రామికవేత్త. కాశీ నుంచి కన్యాకుమారి వరకు 17 రాష్ట్రాల్లో 3 వేల దేశీ టీ టైమ్ అవుట్ లెట్లు స్థాపించిన వ్యక్తి. ఈ అవుట్ లెట్ల ద్వారా సుమారు 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. 800 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేశారు. అలాంటి వ్యక్తి జనసేన పార్టీలోకి రావడం సంతోషంగా ఉంది. ఉదయ్ శ్రీనివాస్ ను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను” అని అన్నారు.

అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఉంగుటూరు శ్రీ జనసేన పార్టీలో చేరారు. శ్రీ లక్ష్మి నారాయణ ఫౌండేషన్ చైర్మన్ పత్సమట్ల ధర్మరాజు, ఫౌండేషన్ సభ్యులు వంగా రఘురామచంద్ర శేఖర్, చింతలపాటి వెంకట సత్యనారాయణరాజు (బాషిరాజు), పొత్తూరి కృష్ణంరాజు (వాసు) తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరందరికీ పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు. వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 16 =