కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా జులై 1 నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం

India Central Govt Bans Single Use Plastic Items From July 1, Central Govt Bans Single Use Plastic Items From July 1 Govt Bans Single Use Plastic Items From July 1, India will ban sale and use of identified single use plastic items, India will ban manufacture of identified single use plastic items, India will ban import of identified single use plastic items, India will ban stocking of identified single use plastic items, India will ban distribution of identified single use plastic items, single use plastic items, Govt Bans Single Use Plastic Items, Single Use Plastic Items Bans From July 1, India Central Govt, Central Govt, Single Use Plastic Items News, Single Use Plastic Items Latest News, Single Use Plastic Items Latest Updates, Single Use Plastic Items Live Updates, Mango News, Mango News Telugu,

ప్లాస్టిక్‌..ప్లాస్టిక్‌.. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు, ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్న అంశం. గ్లోబల్ వార్మింగ్ కు ప్రధాన కారణాలలో ప్లాస్టిక్‌ కూడా ఒకటి అని వారి ఆరోపణ. అలాగే క్యాన్సర్ వ్యాధి కారకాలలో ప్లాస్టిక్‌ కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం. దానికి తగ్గట్లే మనచుట్టూ ఎటు చూసినా ప్లాస్టిక్‌ వ్యర్ధాలే కనిపిస్తాయి. మనం కూడా ప్లాస్టిక్‌ వాడకుండా రోజు గడపలేని స్థితిలో ఉన్నాం. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు అని అందరూ భయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో.. భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా జులై 1వ తేదీ నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం 19 రకాల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం అమలవనుంది. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నారు. దీని ప్రకారం ఆయా వ్యక్తులకు, సంస్థలకు జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా విధించేందుకు వీలుంది. కాగా కేంద్రం నిషేధం విధించిన ప్లాస్టిక్ వస్తువులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • ప్లాస్టిక్ కర్రలతో చేసిన ఇయర్ బడ్స్.
  • బెలూన్లకు ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు.
  • మిఠాయి స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్.
  • అలంకరణ కోసం పాలీస్టైరిన్ (థర్మోకోల్).
  • ట్రేలు, స్వీట్ బాక్స్‌ల చుట్టూ ఫిల్మ్‌లు చుట్టడం లేదా ప్యాకింగ్ చేయడం.
  • ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, ప్లాస్టిక్ కత్తి పీటలు.
  • ఆహ్వాన కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్‌లు, స్టిరర్లు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =