విజయభాస్కర్‌ రెడ్డి పార్టీ మార్పు వెనుక కీలక నేత

Vijayabhaskar Reddy Joined TDP,BJP,Challa Family,Challa Vijayabhaskar Reddy,Congress,Janasena,Joined TDP,Karnool Politics,TDP,YCP,Mango News,Mango News Telugu,Kotla Vijaya Bhaskar Reddy Joined TDP,Challa Vijay Bhaskar Reddy Joins TDP,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,Mango News,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Vijaya Bhaskar Reddy,Vijay Bhaskar Reddy Latest News,Vijay Bhaskar Reddy News,TDP News,Nara Lokesh,Chandrababu Naidu,Karnool News,Vijay Bhaskar Reddy Joins TDP

ఏపీ రాజకీయాలు పూటపూటకి హీటెక్కిపోతున్నాయి. జిల్లాలు, నియోజకవర్గాలలో అసంతృప్తులు, బుజ్జగింపులు, పార్టీలు మారడాలతో ఏపీ రాజకీయాలలో మంటలు రేగుతున్నాయి. తాజాగా  కర్నూలు జిల్లా రాజకీయాల్లో  మాజీ ఎమ్మెల్యే, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి ఫ్యామిలీలో చీలిక రావడం హాట్ టాపిక్ అయింది. చల్లా రామకృష్ణారెడ్డి  సోదరుడైన అవుకు సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్‌ రెడ్డి తాజాగా టీడీపీలో  చేరడం కర్నూలు జిల్లాలో చర్చనీయాంశం అయింది.

చల్లా కుటంబం మొత్తం వైఎస్పార్సీపీలో  ఉంటే.. విజయభాస్కర్‌ రెడ్డి మాత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్‌ అవడంతో రాజకీయ వర్గాలలో విస్తృత చర్చకు దారి తీస్తుంది. నిజానికి చల్లా రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భగీరథరెడ్డి మృతి తర్వాతే.. ఆ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కడం ప్రారంభం అయ్యాయి.

అప్పటి నుంచీ చల్లా కుటుంబమంతా  రెండు, మూడు వర్గాలుగా చీలిపోయింది. చల్లా పెద్ద కొడుకు విగ్నేష్‌రెడ్డి, చిన్నకొడుకు భగీరథరెడ్డి భార్య శ్రీలక్ష్మికి మధ్య కొద్ది రోజులుగా రాజకీయ వారసత్వ పోరు తారాస్థాయికి చేరింది.  వీరిద్దరి వ్యవహారంతో ఆ కుటుబాలు కేసులు, కోర్టుల వరకు వెళ్లాల్సి వచ్చింది. అయినా కూడా ఇప్పటి వరకూ చల్లా కుటుంబం అంతా కూడా వైఎస్సార్సీపీలోనే ఉంది.

అవుకు మండలంలో చల్లా కుటుంబానికి గట్టి పట్టు ఉండటంతో.. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ అభ్యర్థి అయిన బీసీ జనార్దన్‌రెడ్డి  చల్లా కుటుంబంలో చీలిక తెచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా చల్లా కుటుంబంలో రగులుతున్న విభేదాలను పసిగట్టిన టీడీపీ నేత బీసీ జనార్దన్‌రెడ్డి.. చల్లా విజయభాస్కర్‌ రెడ్డిపై ఫోకస్‌‌ను పెంచి..తెలుగు దేశం పార్టీ కండువా కప్పించడంలో  సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.

అలాగే  బనగానపల్లె వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.. చల్లా కుటుంబంలో చీలిక రాకుండా  ఐక్యంగా ఉంచడం కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, రామిరెడ్డి చాలాసార్లు చల్లా కుటుంబ సభ్యులను కలిసి వారితో చర్చించి విభేదాలు పరిష్కరించే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు ఏకంగా చల్లా విజయభాస్కర్‌ రెడ్డి టీడీపీ కండుపా కప్పుకోవడంతో.. చల్లా ఫ్యామిలీ ప్రతిష్టపై కర్నూలులో  హాటుహాటు చర్చలు కొనసాగుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 7 =