విశాఖలో కిడ్నాప్ లో పరంపర, ఏమయ్యిందీ నగరానికి?

Visakhapatnam turning into crime capital after series of kidnappings in few days,Visakhapatnam turning into crime capital,capital after series of kidnappings,series of kidnappings in few days,Visakhapatnam kidnappings in few days,Visakhapatnam series of kidnappings,Mango News,Mango News Telugu,Yet another Kidnap surfaces in Vizag city,Visakhapatnam Latest News,Visakhapatnam Latest Updates,Visakhapatnam Live News,Visakhapatnam kidnappings Latest News,Visakhapatnam kidnappings Latest Updates,Visakhapatnam kidnappings Live News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

విశాఖ..సాగరతీర నగరంలో కలకలం రేగుతోంది. కాబోయే రాజధానిగా చెబుతున్న విశాఖపట్నంలో కిడ్నాప్ లో పరంపర అందరినీ కలవరపరుస్తోంది. అందులోనూ ఏకంగా ఎంపీ కుటుంబ సభ్యులు కూడా కిడ్నాప్ కి గురయిన ఘటన మరువకముందే తాజాగా మరో రియాల్టర్ కిడ్నాప్ కి గురికావడం ఆందోళనకు గురిచేస్తోంది. నగర వాసుల్లో ఈ పరిణామాలు అలజడి రేపుతున్నాయి.

విశాఖ వైఎస్సార్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ భార్యాపిల్లల కిడ్నాప్ ఘటన అటు రాజకీయంగానూ దుమారం రేపింది. ప్రముఖ ఆడిటర్, మాజీ స్మార్ట్ సిటి చైర్మన్‌ జీవీతో పాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు చందు, భార్య జ్యోతిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ విషయం క్షణాల్లో మీడియాలో వైరల్ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు క్షణాల్లో ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ ఆచూకీని కనుగొన్నారు. కిడ్నాపైన ముగ్గురూ క్షేమంగా ఉన్నారని ఎంపీ తెలిపారు. విశాఖ-ఏలూరు రోడ్డులో ఎంపీ భార్య, కుమారుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. కానీ ఈ ఘటన మాత్రం ప్రకంపనలు పుట్టించింది. చివరకు నేరుగా సీఎం జగన్ కూడా ఆ తర్వాత ఎంపీతో పాటుగా భార్యతోనూ మాట్లాడారు. అదే సమయంలో ఈ ఘటనతో ఎంపీ సత్యనారాయణ కూడా తన వ్యాపారాలను విశాఖలో విరమించుకుంటున్నట్టు ప్రకటించడం విస్మయకరంగా మారింది.

ఈ ఘటన ఇంకా మరువకముందే విశాఖలోనే మరో రియల్టర్ కుటుంబం కిడ్నాప్‌నకు గురైంది. శ్రీనివాస్ అనే రియల్టర్‌తో పాటు ఆయన భార్య లోవ లక్ష్మి కిడ్నాప్ కి గురయ్యారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కిడ్నాప్‌ వ్యవహారం వెలుగులోకి రాగానే పోలీసులు అప్రత్తమయ్యారు. కిడ్నాప్ కి కారకులుగా చెబుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రియాల్టర్ శ్రీనివాస్ దంపతులు కొద్దిరోజుల క్రితమే విశాఖలో స్థిరపడ్డారు. విజయవాడ నుంచి విశాఖకి వలస వచ్చారు. అంతకుముందు కూడా వారిపై కేసులున్నాయి. విజయవాడలో కూడా వారిని దుండగులు డబ్బు కోసం కిడ్నాప్ చేసిన అనుభవం ఉంది. చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ ని ఇప్పుడు విశాఖలో మరోసారి కిడ్నాప్ చేసిన వ్యవహారం కలకలం రేపింది. వరుస కిడ్నాప్ లతో ఇప్పుడు విశాఖ వాసులు కలవరపడుతున్నారు. పోలీసులు అప్రమత్తం కావాలని అంతా ఆశిస్తున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగానూ చర్చనీయాంశం అవుతున్నాయి. డబ్బులు కోసం కిడ్నాప్ లకు పాల్పడే ముఠాలు పెరిగిపోతున్నప్పటికీ పోలీసుల స్పందన అంతంతమాత్రంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =