బ్యాక్టీరియాతోనే సహజీవనం..జర జాగ్రత్త

The bacteria present in these things in our house increases more during the rainy season,The bacteria present in these things,bacteria present in these things in our house,bacteria increases more during the rainy season,Bacteria present in the rainy season,Mango News,Mango News Telugu,Bacteria in the environment,bacteria in our house,bacteria present in our house,Bacteria during the rainy season,Bacteria in rainy season Latest News,Common Monsoon Diseases,Rainy season diseases,Bacteria in rainy season Latest Updates,Bacteria in rainy season Live Updates

వానాకాలం వచ్చేసింది. ఇప్పటి వరకూ ఎండలతో అల్లాడిన జనాలకు వానలు కాస్త హాయిగా అనిపించినా.. వర్షాలతో పాటే.. వ్యాధి కారకాలనూ తన వెంట తీసుకు వచ్చే ప్రమాదం పొంచి ఉందని డాక్లర్లు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో ఎక్కువ తేమ వల్ల వాతావరణంలో బ్యాక్టీరియా(Bacteria in the environment) వేగంగా వృద్ధి చెందుతుంది. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో మనం నిత్యం వినియోగించే వస్తువులపై ఉండే బ్యాక్టీరియా (Bacteria on objects) వేగంగా వృద్ధి చెందుతుందని చెబుతున్నారు.. దాని వల్ల బ్యాక్టీరియా నేరుగా శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులను కలిగిస్తుంది.

మన ఇంట్లో ఈ వస్తువుల్లో ఉండే బ్యాక్టీరియా వర్షాకాలంలో మరింత పెరుగుతుందట..

ఒక అమెరికన్ కంపెనీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం (According to a study).. ఇంట్లో వాడే కొన్ని వస్తువులే చాలా వ్యాధులకు కారణం అవుతున్నాయి. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా కూడా కొన్ని విషయం గురించి అంతా తెలుసుకోవాలి. మన టాయిలెట్ సీటుపై ఉన్న బ్యాక్టీరియా(Bacteria on the toilet seat) కంటే కూడా ఒక వారం పాటు ఉతకకుండా ఉంచిన దిండు లేదా పిల్లో కవర్ల (Pillow Covers)లో 17వేల రెట్లు ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటాయట.

అలాగే ఇన్ఫెక్షన్ వ్యాప్తి జాబితాలో మన అత్యంత ఇష్టంగా వాడే మొబైల్ ఫోన్ (Mobile Phone) టాప్ ప్లేస్‌లో ఉందంటే నమ్ముతారా? కానీ ఇది కూడా నిజం. వివిధ అధ్యయనాల ప్రకారం స్మార్ట్‌ఫోన్‌లో టాయిలెట్ సీటు కంటే కూడా 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట. అంతే కాదు కీబోర్డ్( Key Board) కూడా బ్యాక్టీరియాను బాగానే పెంచి పోషిస్తుందట. ఉద్యోగానికి వెళ్లేటపుడు చాలా చోట్ల ఒకే కంప్యూటర్‌ను చాలామంది వాడుతుంటారు.అలా చాలా ఎక్కువగా తాకే మరొక వస్తువు కీబోర్డ్. యూనివర్శిటీ ఆఫ్ అరిజోనా అధ్యయనం ప్రకారం, ప్రతీ కీబోర్డ్‌లో చదరపు అంగుళానికి 3 వేల బ్యాక్టీరియాల వరకూ ఉంటాయట.

ఇక మన ఇంట్లోనే మరో వస్తువు రిమోట్ (Remote). దీనికోసం ఒక్కోసారి కుటుంబసభ్యుల మధ్య చిన్న పాటి యుద్ధాలు కూడా అవుతూ ఉంటాయి. అంతా వాడే వస్తువే అయినా కాస్త తక్కువగా శుభ్రం చేసే వస్తువుల్లో రిమోట్‌దే ఫస్ట్ ప్లేస్. రిమోట్లో చదరపు అంగుళానికి 200 వరకూ బ్యాక్టీరియా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అధ్యయనం కనుగొంది. కంప్యూటర్ మౌస్ కూడా అంతే.. దీనిలో కూడా బ్యాక్టీరియాలకు ఏం కొదువ ఉండదు. మౌస్‌పై చదరపు అంగుళానికి 1,500 బ్యాక్టీరియాలు ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా స్టడీలో తేలింది.

అంతేకాదు మనం పదేపదే తిప్పుతూ వాడే ట్యాప్‌ (Tap)పైనా బ్యాక్టీరియా బాగానే ఉంటుంది. అందుకే చేతులు కడుక్కున్న తర్వాత సబ్బు లేదా హ్యాండ్ వాష్‌తో కొద్దిగా శుభ్రం చేసుకోవాలి. అలాగే అంతా ఎక్కువ సార్లు వాడే రిఫ్రిజిరేటర్ డోర్ బ్యాక్టీరియాకు పుట్టినిల్లుగానే చెప్పుకోవచ్చు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవిస్ నిర్వహించిన ఒక అధ్యయనంలో రిఫ్రిజిరేటర్ డోర్‌లో చదరపు అంగుళానికి 500 వరకూ బ్యాక్టీరియాలు ఉంటాయని తేలింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =