అనంతపురం తమ్ముళ్ల తగాదాలతో టీడీపీకి కొత్త తలనొప్పులు

TDP High Command faces new headache with group fights in Anantapur,TDP High Command faces new headache,TDP new headache with group fights,group fights in Anantapur,TDP High Command faces group fights,Mango News,Mango News Telugu,Internal squabbles hit TDP,TDP High Command,TDP High Command Latest News,TDP High Command Latest Updates,TDP High Command Live News,Anantapur Latest News,TDP Anantapur Latest News,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Group fights in Anantapur Latest News

గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన తెలుగుదేశం పార్టీ ఈసారి రాయలసీమ మీద కూడా గట్టి ఆశలే పెట్టుకుంది. అందులోనూ అనంతపురం జిల్లా మళ్లీ తమను ఆదరిస్తుందని నమ్ముతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతీ ఎన్నికల్లోనూ అనంతపురంలో ఆపార్టీకి ఆదరణ దక్కింది. అనంత వాసులు ఆదరిస్తేనే టీడీపీకి పీఠం దక్కుతుందనే అభిప్రాయం కూడా ఉంది. దానికి తగ్గట్టుగానే ఇటీవల యువగళం పాదయాత్ర విజయవంతం కావడం, మండలి ఎన్నికల్లో పట్టభద్రుల మద్ధతు దక్కడంతో టీడీపీలో ఉత్సాహం కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికల్లో కేవలం ఉరవకొండ, హిందూపురం మాత్రమే దక్కగా ఈసారి అరడజను సీట్లకు పైగా ఖాయమనే ధీమాతో సాగుతోంది.

తెలుగుతమ్ముళ్ళ తగాదాలు మాత్రం పార్టీలో పెరిగిపోతున్నాయి. ఇది అధిష్టానాన్ని కూడా కలవరపెడుతోంది. ఇటీవల భవిష్యత్తుకి భరోసా పాదయాత్ర సందర్భంగా ఈ విబేధాలు బయటపడ్డాయి. ముఖ్యంగా పెనుకొండ, కళ్యాణదుర్గం, శింగనమల వంటి స్థానాల్లో ఆధిపత్య పోరు బహిరంగంగానే సాగుతోంది. పెనుకొండలో సీనియర్ నేత పార్థసారధి, మహిళా నాయకురాలు సవిత మధ్య వివాదం వీధికెక్కింది. ఇరు వర్గాలు బాహాటంగా కొట్టుకోవడంతో పార్టీ విబేధాలు రచ్చకెక్కాయి.

ఎన్నికలు సమీస్తున్న తరుణంలో జరుగుతున్న పరిణామాలు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ బస్సుయాత్ర జరిగిన రెండు నియోజకవర్గాల్లో కూడా విబేధాలు బయటపడ్డాయి.పెనుకొండతో పాటుగా కళ్యాణదుర్గంలో కూడా పార్టీ నేతల కలహాల కారణంగా రచ్చ జరిగింది. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వర నాయుడులు వర్గీయులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. రెండు వర్గాలను కూడా నాయకత్వం నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలతో ఏకంగా మడకశిర నియోజకవర్గంలో బస్సు యాత్ర కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇక శింగనమలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్యేని ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. దాంతో వ్యవహారం ముదురుతోంది. ఈ పరిణామాలతో టీడీపీ అధిష్టానం కూడా మేలుకుంటోంది. జిల్లాలో పార్టీ పరిస్థితి పూర్తిగా చేజారకముందే చక్కదిద్దాలనే సంకల్పానికి వచ్చింది. అందులో భాగంగా కీలక నియోజకవర్గాల్లో గ్రూపుల వారీగా నాయకులను మంగళగిరికి పిలిచారు. ఎన్టీఆర్ భవన్ లో ఆయా నేతలకు అధినేత చంద్రబాబు క్లాస్ తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ విబేధాలు ఎంతమేరకు కొలిక్కి వస్తాయన్నది ఆసక్తికరంగా మారుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − fifteen =