వారంతా ఎక్కడ నుంచి బరిలో దిగుతున్నారు?

YCP Cine Celebrity Candidates.., YCP Cine Celebrity, YCP Cine Celebrity Candidates,Congress, YCP, Modi, Jagan government, pawan kalyan, NDA, YCP, TDP, janasena, Chandra babu, BJP, Mango News, Mango News Telugu
YCP Cine Celebrity Candidates,Congress, YCP, Modi, Jagan's government, pawan kalyan, NDA, YCP, TDP, janasena, Chandra babu, BJP,

ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఎన్నికల తేదీలు మార్చి 16న రిలీజ్ కావడంతో  అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తును స్పీడప్ చేశారు.ఇలా ఏపీలో జరుగబోయే ఎన్నికల తేదీ కూడా ఖరారు కావడం..వైసీపీ అభ్యర్దుల పూర్తి జాబితా పాటు..టీడీపీ,జనసేన, బీజేపీ కూడా దాదాపు తమ అభ్యర్థులను ప్రకటించేయడంతో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. అయితే ఈ ఎన్నికలలో కొంతమంది సినీ సెలబ్రెటీలు పోటీ దిగడంతో..ఏ సినీ సెలబ్రెటీ ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారనే చర్చ ఏపీ వ్యాప్తంగా నడుస్తోంది.

నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డైరక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు.. పెట్ల ఉమా శంకర్ గణేష్ మరోసారి కూడా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే  చాలా టాలీవుడ్  సినిమాలకి నిర్మాతగా వ్యవహరించిన  ఎంవీబీ సత్యనారాయణ.. గతంలో వైజాగ్ ఎంపీగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో విశాఖపట్నం ఈస్ట్ నుంచి బరిలోకి  దిగుతున్నారు.

డైరక్టర్ట కురసాల కళ్యాణ్ కృష్ణ అన్నయ్య..గతంలో  కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కూడా కాకినాడ రూరల్ నుంచే పోటీ చేస్తున్నారు. మరోవైపు  ఒక మూవీలో  హీరోగా నటించిన మర్గాని భరత్ రామ్ ..ఇప్పుడు రాజమండ్రి ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికలలో  రాజమండ్రి రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమంలో గతంలో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వహించిన కొడాలి నాని.. గుడివాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరోసారి మళ్లీ అదే స్థానం నుంచి తిరిగి పోటీ చేయనున్నారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలు అనేక సినిమాలకు నిర్మాతగా వహించిన వల్లభనేని వంశీ మోహన్..ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ సారి ఎన్నికలలో కూడా ఆయన అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇక ఈ లిస్టులో సినీ రచయిత కోన వెంకట్ బాబాయ్ అయిన కోన రఘుపతి బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మూవీ ఫీల్డుకు చెందిన హీరో కమలాకర్ రెడ్డి సోదరుడైన బాచుపల్లి శివప్రసాద్ రెడ్డి.. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు  కానీ..రాబోయే ఎన్నికలలో  దర్శి నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా..మరోసారి అక్కడే నుంచే బరిలో దిగనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 12 =