సీఎం క్యాంపు ఆఫీసుకు క్యూ కడుతున్న నేతలు

YCP Leaders Queuing Up At The CM's Camp Office, YCP Leaders Queuing Up, CM Camp Office YCP Leaders Queuing Up, YSRCP,CM Jagan,YCP Final List,YCP Leaders, CM's Camp Office,YCP,TDP,Janasena, BJP, Congress, Chandrababu, YCP, Mango News, Mango News Telugu
YSRCP,CM Jagan,YCP final list,YCP leaders, CM's camp office,YCP,TDP,Janasena, Bjp, Congress, Chandrababu, YCP,

త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో అన్ని పార్టీల అధినేతలు..తమ తమ పార్టీల అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగానే వైసీపీ అధినేత సీఎం జగన్ ఈ నెల 16వ తేదీన వేంపల్లె మండలం ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పిస్తారు.ఆ తర్వాత వైఎస్సార్ ఘాట్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు.

ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్ధులను ప్రకటిస్తూ వస్తున్న జగన్..ఇప్పుడు తుది జాబితాను కూడా రెడీ చేశారు. మొత్తంగా  చిన్నచిన్న మార్పులతో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడానికి  సిద్ధమయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా . వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి వైసీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అదే సెంటిమెంటును ఫాలో అవుతూ ఈ సారి కూడా ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి రెడీ అవుతున్నారు.

అదే రోజు సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటించనున్నట్లు వైసీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ నెల 18న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి వైసీపీ  అధినేత ఎన్నికల ప్రచారం మొదలుపెడతారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టి అదే రోజు విజయవాడ వెస్ట్ ,నెల్లూరు రూరల్‌లో జగన్ ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అలా ప్రతి రోజూ.. రోజుకు 2 లేదా 3 బహిరంగ సభలలో, రోడ్ షో లో జగన్ పాల్గొనే విధంగా రూట్ మ్యాప్ సిద్దం చేసినట్లు వైసీపీ నేతలు  చెబుతున్నారు.

అయితే ఈ న్యూస్ తెలిసిన తర్వాత మిగిలిన ఆశావాహులంతా తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు క్యూ కడుతున్నారు.  సీఎం జగన్ అభ్యర్థుల ఫైనల్ జాబితాను సిద్ధం చేసే పనిలో ఉండగా.. ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ఆయా నియోజకవర్గ ఆశావాహులు క్యూ కడుతున్నారు. జగన్‌తో ఇలా భేటీ అయిన వారిలో అంబటి రాంబాబు, రోజా, దాడిశెట్టి రాజా, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు కొంతమంది నేతలు సీఎం జగన్ తో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − six =