వైసీపీ ద్వితీయశ్రేణి నాయకుల్లో మాత్రం గుబులు

Gubulu Is Among The Secondary Leaders Of YCP, Gubulu Is Among The Secondary Leaders, Secondary Leaders Of YCP, CM Jagan, AP Election, Secondary Leaders Of YCP,TDp, Congress, Chandrababu, YCP, CM Jagan, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
CM Jagan, AP Election, secondary leaders of YCP,TDP, Congress, Chandrababu, YCP,

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొంది.  సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏ క్షణమైనా షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే అన్ని పార్టీలు ప్రచార వ్యూహంలో దిగడానికి సన్నాహాలు చేస్తుంటే..  వైసీపీ నేతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పెద్ద స్థాయి నేతంతా గెలుపోటములపై టెన్షన్ పడుతుంటే..ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం జగన్ గవర్నమెంట్ హయాంలో  చేసిన పనులకు ఇంకా బిల్లులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీ లీడర్స్ చాలా దూకుడుగా వ్యవహరించారు. ముందూ వెనుక ఏ మాత్రం ఆలోచించకుండా జగన్‌పై నమ్మకం పెట్టుకుని  ప్రభుత్వ భవనాల నిర్మాణాల నుంచి.. కోవిడ్ 19 సేవల వరకు సొంత డబ్బులు చాలా ఖర్చు చేసేశారు. కానీ రోజులు నెలలు.. నెలలు సంవత్సరాలు అవడం తప్ప వారికి నయా పైసా ముట్టలేదు. ఇప్పుడు  ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.  కానీ ఇంతవరకు బిల్లుల చెల్లింపు ఊసే ఎత్తడం లేదు సీఎం జగన్.

ద్వితీయ శ్రేణి నాయకులంతా కేవలం జగన్ మాటలు నమ్మి..అప్పట్లో పనులు వేగవంతం చేయాలని..తమ పేరు నిలవాలని..ఫైనాన్షియర్ల దగ్గర అప్పులు తీసుకుని పార్టీ పనులు చేశారు. అయితే అస్మదీయ కంపెనీలకు నిధులను అప్పు తెచ్చి మరీ చెల్లించిన జగన్..పార్టీని నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నేతలను  మాత్రం గాలికి వదిలేసారు. దీంతో ఇంటా బయట ఆర్ధికంగా నష్టపోయిన వారంతా ఇప్పుడు గుండెపోట్లు తెచ్చుకుంటున్నారట.

కొద్ది రోజుల్లోనే ఏపీలో ఎన్నికల కోడ్ రానుంది.అప్పుడు ఎలాంటి ప్రభుత్వ చెల్లింపులకు కూడా అవకాశం ఉండదన్న విషయం తెలిసిందే. అందుకే  తాము చేసిన పార్టీ పనులకు బిల్లులు చెల్లించండంటూ.. వేలాదిమంది వైఎస్సార్సీపీ ద్వితీయ శ్రేణి లీడర్స్ అంతా పెద్దపెద్ద నేతల  చుట్టూ తిరుగుతూ..వారిపై ఒత్తిడి తెస్తున్నారు.ఎందుకంటే వైసీపీకి అనుకూల పవనాలు లేకపోవడంతో .. ప్రభుత్వం మారితే పైసా కూడా రాదని  ఆందోళన చెందుతున్నారు.

అయితే గత ప్రభుత్వాలు ఏమైనా సరే తమ కంటే ముందు ప్రభుత్వాలు చేసిన పనులకు మొత్తం బిల్లులు చెల్లించేవి. జగన్ గవర్నమెంట్ ఆ సంప్రదాయానికి తిలోదకాలు  ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏ  పనులకు కూడా బిల్లులు చెల్లించలేదు. బాధితులు కోర్టులకు వెళ్లినా కూడా  వారికి  ఇప్పటికీ న్యాయం జరగలేదు. దీంతో రేపు టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా బిల్లులు రాబట్టుకోవడం జరగదన్న ఆందోళన ఇప్పుడు వైసీపీ చోటా లీడర్స్ లో కనిపిస్తోంది.

వీళ్ల  కోసం ఎమ్మెల్యేలు, ఆ పై స్థాయిలో నేతలు కూడా ప్రయత్నించినా ద్వితీయ శ్రేణి నాయకులకు పని జరగలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో..తమకు న్యాయం చేయాలంటూ వైసీపీ బడా నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అలా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు వేలాది దరఖాస్తులు వచ్చినా..ఆయన కూడా చేతులెత్తేసినట్లే తెలుస్తోంది.దీంతో వారంతా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =