ఏపీలో ఎమ్మెల్యే నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సీఎం జగన్ మాకు ప్రాధాన్యం ఇచ్చారు – వైసీపీ కాపు నేతలు

YS Jagan Mohan Reddy Govt Gives Most Importance For Kapu Community in AP Says YSRCP Kapu Leaders, YSRCP Kapu Ministers, YSRCP Kapu MLAs, YSRCP MLCs , YSRCP Leaders Kapu Meeting, Kapu Meeting Rajahmundry, Mango News, Mango News Telugu, Janasena Chief Pawan Kalyan News And Live Updates, AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం మరియు జనసేన మధ్య ఎన్నికల పొత్తు ఉండొచ్చన్న ఊహాగానాల మధ్య అధికార పార్టీ ప్రత్యేక రాజకీయ వ్యూహాన్ని రచించేందుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు కీలక కాపు నేతలు రాజమండ్రిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్‌, మాజీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు తదితరులు ఉన్నారు. ఇక ఈ సమావేశంలో ప్రభుత్వం కాపుల అభ్యున్నతి కోసం చేస్తున్న కార్యక్రమాలను సుదీర్ఘంగా చర్చించారు.

సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని కాపు సామజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఎమ్మెల్యే నుంచి నామినేటెడ్ పదవుల వరకూ కాపులకు పలు అవకాశాలు ఇచ్చారని పేర్కొన్నారు. కేవలం కాపులకు మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని వారు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు కాపులను కేవలం ఓటు బ్యాంక్‌గా పరిగణించేయని, కానీ సీఎం జగన్‌ మాత్రం వారికి పెద్దపీట వేశారని తెలిపారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సామాజిక న్యాయం అమలుచేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని, ఏకైక సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. ఇక త్వరలోనే విజయవాడలో కాపు సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో విస్తృత సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వారు ప్రకటించారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై కాపు నేతల కీలక వ్యాఖ్యలు..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిలకడ లేని రాజకీయాలు చేస్తున్నారని, ప్రతి ఎన్నికల్లో ఎదో ఒక పార్టీకి కొమ్ము కాయడానికే ఆయన మొగ్గుచూపుతున్నారని విమర్శించారు. గత ఎన్నికలప్పుడు విడిపోయిన టీడీపీతో మళ్ళీ పొత్తుపెట్టుకోవడానికి తహతహలాడుతున్నారని, దీనిద్వారా అయన వెంట నడుస్తున్న కాపు యువకుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. నాడు వంగవీటి రంగా హత్య గురించి పవన్ వాస్తవాలు తెలుసుకోవాలని, అలాగే ఒక పార్టీకి అధినేతగా ఉండి సభ్య సమాజం సిగ్గుపడేలా పరుష పదజాలంతో సాటి కాపు సోదరులను తిట్టడం ఆయన మానుకోవాలని హితవు పలికారు. టీడీపీ హయాంలో కాపు నేతలను వేధించారని, సీఎం జగన్ మాత్రం వారికి సముచిత పదవులు ఇచ్చి గౌరవించారని పవన్ గమనించాలని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =