న్యూజిలాండ్ తో వన్డే, టీ20 సిరీస్: భారత్ జట్టు ప్రకటన, వన్డే కెప్టెన్ గా శిఖర్ ధావన్, టీ20 కెప్టెన్‌ గా హార్దిక్ పాండ్యా

BCCI Announces India's Squad for New Zealand Tour Shikhar Dhawan As ODI Captain Hardik Pandya as T20 Captain, BCCI Announces India's Squad, India New Zealand Tour, Shikhar Dhawan As ODI Captain,Hardik Pandya as T20 Captain, Mango News, Mango News Telugu, Shikhar Dhawan New Zealand ODI Captain, Hardik Pandya New Zealand T20 Captain, Shikhar Dhawan, Hardik Pandya, New Zealand Vs India, New Zealand Cricket Team, Indian Cricket Team, BCCI Latest News And Updates

భారత్ క్రికెట్ జట్టు త్వరలో న్యూజిలాండ్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల​ మధ్య నవంబర్ 18, 20, 22వ తేదీల్లో 3 టీ20ల సిరీస్, అలాగే నవంబర్ 25, 27, 30వ తేదీల్లో 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తో జరిగే వన్డే, టీ20 సిరీస్ లలో తలపడే భారత్ జట్లను ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు బీసీసీఐ సోమవారం నాడు ప్రకటించింది.

న్యూజిలాండ్ తో సిరీస్ లకు నిర్ణీత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్ రాహుల్, మహ్మద్‌ షమీలకు విశ్రాంతి కల్పించారు. దీంతో ఈ వన్డే సిరీస్ కు కెప్టెన్ గా శిఖర్ ధావన్ ను, టీ20 సిరీస్ కు కెప్టెన్ గా హార్దిక్‌ పాండ్యాను నియమించారు. ఇక వన్డే, టీ20 లకు వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నట్టు బీసీసీఐ తెలిపింది. ఈ రెండు సిరీస్ లకు సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అలాగే వన్డే జట్టులో కుల్దీప్ సేన్ కు పిలుపువచ్చింది.

న్యూజిలాండ్ తో 3 టీ20లకు భారత్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.

న్యూజిలాండ్ తో 3 వన్డేలకు భారత్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.

న్యూజిలాండ్ తో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్:

  • మొదటి టీ20 – నవంబర్ 18 – స్కై స్టేడియం, వెల్లింగ్టన్
  • రెండో టీ20 – నవంబర్ 20 – బే ఓవల్, మౌంట్ మౌంగనుయి
  • మూడో టీ20 – నవంబర్ 22 – మెక్లీన్ పార్క్, నేపియర్

న్యూజిలాండ్ తో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్:

  • మొదటి వన్డే – నవంబర్ 25 – ఈడెన్ పార్క్, ఆక్లాండ్
  • రెండో వన్డే – నవంబర్ 27 – సెడాన్ పార్క్, హామిల్టన్
  • మూడో వన్డే – నవంబర్ 30 – హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =