అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ

YSRCP Candidate Valmiki Mangamma Unanimously Elected as MLC From Anantapur District, YSRCP Candidate Valmiki Mangamma, Valmiki Mangamma Unanimously Elected as MLC, Valmiki Mangamma Anantapur MLC, YSRCP Valmiki Mangamma Unanimous MLC, Mango News, Mango News Telugu, Tdp Mlc List,Ap M L C Phone Numbers,Ap M.L.C. Phone Numbers,Ap Mlc Members List,Ap Mlc Voter Registration,Kalpalatha Reddy Mlc Address,Mlc Constituency In Ap,Mlc Elections,Nara Lokesh Mlc Term,Total Mlc Seats In Ap,Ycp Mlc Ananthababu,Ysrcp Mlc List

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ముందే తొలి ఫలితం వచ్చేసింది. అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారంతో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ చేపట్టారు. ఇక ఈ ఎన్నికలకు కేవలం రెండు నామినేషన్లు దాఖలు కాగా.. అందులో ఒకటి వైసీపీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మది, మరొకటి ప్రతిపక్ష టీడీపీకి చెందిన వేలూరు రంగయ్యది. ఈ క్రమంలో వేలూరు రంగయ్య దాఖలు చేసిన నామినేషన్‌లో సరైన వివరాలు మరియు సంబంధిత డాక్యుమెంట్లు కొన్ని లేవని పేర్కొంటూ రిటర్నింగ్ అధికారులు ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో మిగిలిన నామినేషన్‌ మంగమ్మదే కావడంతో ఆమె ఎన్నిక ఇక లాంఛనమే కానుంది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు మంగమ్మ కృతజ్ఞతలు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + eighteen =