జగన్‌ను వణికిస్తున్న లోకల్ లీడర్స్ భయం

Telangana scene repeat, local leaders, Jagan, Jana Sena, TDP, BJP, YCP,CM Jagan,YSRCP,BRS,Andhra Pradesh News Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Telangana scene repeat, local leaders, Jagan, Jana Sena, TDP, BJP, YCP

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం.. గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు  తమ తమ వ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా టీడీపీ,జనసేన రెండు పార్టీల పొత్తులో భాగంగా 118 స్థానాల అభ్యర్ధుల ఫస్ట్ లిస్ట్‌ను చంద్రబాబు, పవన్ కలిసి ప్రకటించారు. టీడీపీకి 94 స్థానాలు, జనసేనకు 24 స్థానాలలో పోటీ చేయనున్నట్లు  చంద్రబాబు, పవన్  ఈ  లిస్ట్ విడుదల చేశారు. దీంతో వైఎస్సార్సీపీకి టెన్షన్ మొదలైందని వార్తలు ఏపీ  పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

టీడీపీ, జనసేన కూటమి తొలి జాబితా విడుదల చేయడంతో వైఎస్సార్సీపీ  అప్రమత్తమయినట్లు తెలుస్తోంది.  వైఎస్సార్సీపీలో లోకల్ టెన్షన్ మొదలవడంతో.. స్థానిక నేతలు ఓట్లు ఎవరికి వేయిస్తారనే అనుమానం మొదలైంది. ఏపీ సీఎం పాలనపై  ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిన విషయాన్ని  పొలిటికల్ విశ్లేషకులు పదే పదే చెబుతున్నారు. జగన్ సర్కార్ అందజేస్తున్న సంక్షేమ ఫలాలు అందని వారికి..లోకల్  వైసీపీ నేతలు సమాధానాలు చెప్పలేకపోతున్నారని తెలుస్తోంది.

దీంతో వారంతా ఎన్నికల ముందు మరో పార్టీకి జంప్ అయి జగన్‌కు ఝలక్ ఇస్తారా? లేక గతిలేక వైపీపీలోనే ఉంటూ వేరే పార్టీల వారికి ఓటు వేయిస్తారా? అన్న పెద్ద సందేహం జగన్ ను వెంటాడుతుందట. ఒకవేళ లోకల్ లీడర్స్  ఝలక్ ఇస్తే పార్టీ పరిస్తితి ఏంటనే ఆందోళన వైసీపీ అధిష్టానానికి మొదలైందట. అందుకే లోకల్ నాయకులను  గ్రిప్‌లో పెట్టుకోవడానికి వైసీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తుందట. దీనిలో భాగంగా వైసీపీ శ్రేణులను దారిలోకి తెచ్చి  అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేయడానికి జగన్ రెడీ అవుతున్నారట.

మంగళవారం అంటే ఫిబ్రవరి 27న సీఎం జగన్‌ అధ్యక్షతన.. వైసీపీ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు.  తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఏర్పాటు చేయనున్న ఈ మీటింగుకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైసీపీ నాయకులు హాజరవుతారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి లీడర్స్ ఈ మీటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో  బీఆర్ఎస్ పార్టీ  ఓడిపోవడంతో .. బీఆర్ఎస్‌ ఫ్రెండ్లీ పార్టీ అయిన వైసీపీ కూడా అదే తీరులో ఓడిపోతుందని  ప్రతిపక్ష నేతలు జోస్యంచెబుతున్నారు. దీంతో  అప్రమత్తమైన వైఎస్పార్సీపీ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  స్థానిక నేతలు దెబ్బకొట్టడం వల్లే బీఆర్ఎస్‌ ఓడిపోయిందన్న  వాదన గతంలో వచ్చింది. దీంతో బీఆర్ఎస్ చేసిన పొరపాట్లు..త తమ పార్టీలో  రిపీట్ అవకుండా వైసీపీ జాగ్రత్త పడుతోంది.  లోకల్ లీడర్స్‌ను తమ వైపు తిప్పుకునేలా ప్లాన్ చేసిన ఏపీ సీఎం జగన్..రేపు మీటింగ్ ఏర్పాటు చేసి స్థానిక నేతలకు దీనిపై దిశానిర్దేశం చేయడానికి రెడీ అవుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + fourteen =