బీఆర్ఎస్ పార్టీలో చేరిన విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల

Former Vijayawada Mayor Tadi Shakuntala Joins in BRS party in the Presence of BRS AP President Thota Chandrasekhar, Former Vijayawada Mayor Tadi Shakuntala, Mayor Tadi Shakuntala Joins in BRS party, BRS AP President Thota Chandrasekhar Presence, Shakuntala Joins in BRS, Mango News, Mango News Telugu,Brs Party Website,Bharat Rashtra Samithi Website,Brs Ap President Thota Chandrasekhar Ias,Brs Ap President Thota Chandrasekhar Reddy,Brs Ap President Thota Chandrasekhar Wikipedia,Brs Full Form Political Party,Brs In Accounting,Brs National Party,Brs Party,Brs Party By Kcr,Brs Party Date,Brs Party Wiki,Brs Telangana Party,Tadi Shakuntala,Telangana,Trs Brs Party,Trs Party,Trs Party Website,Vijayawada Mayor Anuradha,Vijayawada Mayor Details

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో గురువారం తాడి శకుంతల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తాడి శకుంతలకు తోట చంద్రశేఖర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తాడి శకుంతలతో పాటు మహిళా ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి, పలువురు మైనారిటీ నాయకులు బీఆర్‌ఎస్‌ లో చేరగా, వారికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

కాగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పొత్తులో భాగంగా సీపీఐ తరపున తాడి శకుంతల 2005-06లో ఏడాది పాటు విజయవాడ నగర మేయర్‌ గా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ పార్టీల్లో కూడా కొంతకాలం పనిచేశారు. అనంతరం వైఎస్సార్సీపీ చేరినప్పటికీ ఆమె పార్టీ కార్యక్రమాల్లో యాక్టీవ్ గా లేరు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా బీఆర్ఎస్ లో చేరారు. చేరిక సందర్భంగా తాడి శకుంతల మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 1 =