రాజమండ్రి వైఎస్సార్సీపీలో గందరగోళం, తెరమీదకు వచ్చిన కొత్త నేత ఏం చేస్తారో..

YSRCP Plans For The Victory with New Leader in Rajahmundry in Coming Elections,YSRCP Plans For The Victory,New Leader in Rajahmundry,Rajahmundry in Coming Elections,YSRCP New Leader in Rajahmundry,YSRCP in Coming Elections,Mango News,Mango News Telugu,YSRCP Latest News,YSRCP Latest Updates,YSRCP Live News,YSRCP planning to go it alone,YSRCP Rajahmundry Latest News,YSRCP Rajahmundry Latest Updates,YSRCP Rajahmundry Live News,Rajahmundry News Today,Rajahmundry Latest News and Updates,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

సాధారణ ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ హవా నడిచినప్పటికీ గోదావరి తీరంలో మాత్రం ఆపార్టీ బోల్తా పడింది. రాజమహేంద్రవరం రూరల్, అర్బన్ సీట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా వైఎస్సార్సీపీ సర్థుకున్నట్టు కనిపించడం లేదు. రాజమహేంద్రవరం అర్బన్ సీట్లలో ఏడాదికో ఇన్ఛార్జ్ తరుపున తెరమీదకు రావడం అందుకు నిదర్శనం. ప్రస్తుతం అక్కడి నుంచి ప్రాతనిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి ఆదరణ కొనసాగుతుందనే ధీమా టీడీపీలో ఉంది. అదే సమయంలో వైఎస్సార్సీపీలో గందరగోళం రాజ్యమేలుతోంది.

2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుకి ఇక్కడ వైఎస్సార్సీపీ టికెట్ దక్కింది. కానీ ఆయన మాత్రం 30వేలకి పైబడిన ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యానికి అప్పగించారు. కానీ స్వల్పకాలానికే ఆయన స్థానంలో జనసేన నుంచి వైఎస్సార్సీపీలో చేరిన ఆకుల సత్యన్నారాయణని ఇన్ఛార్జ్ బాద్యతలు దక్కాయి. తీరా ఏడాది తిరగకముందే ఆకుల తెరమరుగయ్యారు. ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా కనిపించడం లేదు. ఆయన పాత్రలో ఎంపీ మార్గాని భరత్ కి రాజమహేంద్రవరం ఇన్ఛార్జ్ బాధ్యతలు దక్కాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో మార్గాని భరత్ పార్లమెంట్ కి బదులుగా అసెంబ్లీ బరిలో ఉంటారనే ఊహాగానాలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన కేవలం సిటీ సీటుకే పరిమితమయ్యి వ్యవహారాలు చక్కబెట్టారు.

కానీ తీరా ఎన్నికలకు కొన్ని నెలల ముందు కొత్త నేత తీరమీదకు వచ్చారు. డాక్టర్ గూడురు శ్రీనివాస్ ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. శ్రీనివాస్ తో పాటుగా ఎంపీ భరత్, మాజీ ఎమ్మెల్యే రౌతు కూడా జగన్ ని కలిశారు. ఆ వెంటనే ఈ ప్రకటన వచ్చింది. నగరంలో ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణుడిగా శ్రీనివాస్ కి పేరుంది. ఆయన భార్య గూడూరి రాధిక గతంలో కాంగ్రెస్ తరుపున కార్పోరేటర్ గా పనిచేశారు. ఆమె అడ్వొకేట్ కూడా. రాజకీయంగా అనుబంధం ఉన్నప్పటికీ గూడూరు శ్రీనివాస్ కి పెద్దగా ప్రభావితం చేసిన చరిత్ర లేదు. అయినప్పటికీ ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం ఆసక్తిగా మారింది. ఆదిరెడ్డి కుటుంబం దూసుకుపోతుంటే ఇప్పుడు గూడురు శ్రీనివాస్ ఎలా ముందుకు సాగుతారన్నది కీలకాంశం. నియోజకవర్గ వ్యవహారాల్లో ఇప్పుడు నాలుగు గ్రూపులుగా ఉన్న సమయంలో కొత్త నేత ఏం సాధించగలరన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఆపార్టీలో గ్రూపులు సమసిపోయే అవకాశం ఏమేరకు అన్నది కీలకాంశం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =