వైఎస్సార్సీపీ ఫ్లీనరీకి అన్ని ఏర్పాట్లు సిద్ధం, ప్లీనరీ నిర్వహణకై కమిటీలు, కన్వీనర్లు వీళ్ళే…

YSRCP Plenary CM YS Jagan Formed 19 Committees and Appointed Conveners, CM YS Jagan Formed 19 Committees and Appointed Conveners, AP CM YS Jagan Formed 19 Committees and Appointed Conveners, AP CM YS Jagan Appointed Conveners, AP CM YS Jagan Formed 19 Committees, 19 Committees, Conveners, YSRCP Plenary, Committees and Conveners, YSRCP Plenary to be Held on July 8 9 at Guntur Leaders Monitoring Arrangements, YSRCP Plenary to be Held on July 8 And 9 at Guntur, YSRCP Leaders Monitoring Arrangements, YSRCP Plenary to be Held at Guntur, Guntur YSRCP Plenary, YSRCP Plenary, Guntur YSRCP Leaders Monitoring Arrangements, ALL Arrangements in full swing for YSRCP plenary at Guntur, YSRCP plenary at Guntur, YSR Congress Party, YSRCP plenary at Guntur News, YSRCP plenary at Guntur Latest News, YSRCP plenary at Guntur Latest Updates, YSRCP plenary at Guntur Live Updates, Mango News, Mango News Telugu,

వైఎస్సార్సీపీ ఫ్లీనరీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ప్లీనరీ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భవించాక ఇది మూడో ప్లీనరీ కాగా, 2019లో ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ ఇదే కానుంది. దీంతో ఈ ప్లీనరీని పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రెండు రోజుల పాటుగా జరిగే ఫ్లీనరీకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు సహా లక్షల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్లీనరీ నిర్వహణకు మొత్తం 19 కమిటీలు, వాటికీ కన్వీనర్లను నియమిస్తూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్లీనరీకి హాజరయ్యే వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా, సక్రమంగా జరిగేలా ఈ కమిటీలు ఏర్పాట్లను పర్యవేక్షించనున్నాయి. ప్లీనరీ నిర్వహణకు సంబంధించి అన్ని కమిటీలు బాధ్యతగా పనిచేయాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. పలువురు సీనియర్ నాయకులకు కమిటీల కన్వీనర్ బాధ్యతలను అప్పగించారు.

ప్లీనరీ నిర్వహణకై నియమించిన కమిటీలు, కన్వీనర్లు వీరే:

  • ప్లీనరీ నిర్వహణ కమిటీ, సమన్వయకర్త – మంత్రి బొత్స సత్యనారాయణ
  • ఆహ్వన కమిటీ – టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
  • ప్రజా ప్రతినిధుల సమన్వయం – రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
  • వేదిక, ప్రాంగణం నిర్వహణ – సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం
  • సభా నిర్వహణ కమిటీ – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • స్టేజ్‌ ప్రోటోకాల్‌ – మంత్రి తానేటి వనిత
  • అలంకరణ కమిటీ – వెల్లంపల్లి శ్రీనివాస్‌
  • వసతి ఏర్పాట్ల కమిటీ – కొలుసు పార్థసారధి
  • తీర్మాణాల కమిటి – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
  • ప్రతినిధులు, పాస్‌లు – మంత్రి గుడివాడ అమర్నాథ్‌
  • భోజన వసతుల కమిటీ – ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి
  • పార్టీ అధ్యక్ష ఎన్నికల కమిటీ – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
  • పార్టీ రాజ్యాంగ సవరణల కమిటీ – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
  • మీడియా, ఫోటో ఎగ్జిబిషన్‌ కమిటీ – పేర్ని నాని
  • హెల్త్‌ కమిటీ – మంత్రి డా.సీదిరి అప్పలరాజు
  • కల్చరల్‌ కమిటీ – వంగపండు ఉష
  • వాలంటీర్స్‌ కమిటీ – గడికోట శ్రీకాంత్‌ రెడ్డి
  • రవాణా కమిటీ – విజయనగరం జెడ్పీ ఛైర్మన్‌ చిన్నశ్రీను
  • ఆడిటోరియం నిర్వహణ కమిటీ – ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − three =