ఢిల్లీలో కరోనా కలకలం – వీకెండ్ కర్ఫ్యూ విధించిన ఆప్ సర్కార్

City reports 5481 new Covid-19 cases, Covid rise, COVID-19, Delhi Covid-19 Cases, Delhi imposes weekend curfew amid Covid surge, Delhi imposes weekend curfew as COVID-19 cases rise, Delhi to Impose Weekend Curfew Amid Rise in COVID-19, Delhi to impose weekend curfew amid rise in COVID-19 cases, Mango News, Weekend curfew imposed in Delhi, Weekend Curfew Imposed in Delhi Amid Rising Covid-19 Cases, Weekend curfew in Delhi

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి సునామీలా విరుచుకు పడుతోంది. గడిచిన మూడు రోజుల్లో అక్కడ 10వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తీవ్రత నేపథ్యంలో.. కరోనా పరిస్థితులపై ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ నేడు సమావేశమైంది. ఎన్నో అంశాల పరిశీలన అనంతరం వారాంతపు కర్ఫ్యూ విధించాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఇప్పటికే నగరంలో ‘ఎల్లో అలర్ట్” ను అమలు చేస్తోన్న ఢిల్లీ సర్కారు.. తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. ఈ వారాంతం నుంచి వీకెండ్ కర్ఫ్యూను అమల్లోకి తెస్తున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మంగళవారం వెల్లడించారు. ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూను అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.

రెడ్ అలర్ట్ ఆంక్షలు: అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది ఇంటి నుంచే పనిచేయాల్సి ఉంటుంది. ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో నిర్వహించుకునేందుకు అనుమతి ఉంటుంది. మాల్స్, సెలూన్స్ వంటి అత్యవసరం కాని దుకాణాలు మూతబడతాయి. ప్రజా రవాణాపై ఆంక్షలు, వివాహాది శుభకార్యాలు, అంత్యక్రియల్లో పాల్గొనే వారిపై పరిమితులు విధించారు. ఇప్పటికే.. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్ళు, జిమ్ సెంటర్లను మూసివేశారు. షాపులను, మాల్స్ ను సరి-బేసి పద్ధతిలో తెరుచుకునేందుకు అనుమతినిచ్చారు.

మొన్నటివరకు మెట్రో బస్సులను సగం సామర్థ్యంతో నడపాలని ఆదేశించారు. మెట్రో స్టేషన్లు, బస్సు స్టేషన్ల వద్ద రద్దీ పెరిగిన నేపథ్యంలో బస్సులు, మెట్రోలను 100 శాతం సామర్థ్యంతో నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మాస్కులు లేకపోతే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఢిల్లీలో వచ్చే వారం నాటికి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారాంతం నాటికి రోజుకు 8-9 వేల కేసులు.. అలాగే, జనవరి 15 నాటికి 20-25 వేల వరకు పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =