చెన్నైలో ఈ రోజు 1146 కరోనా కేసులు నమోదు

1146 New Covid 19 Cases Reported In Chennai, Chennai, Chennai Coronavirus, Chennai Coronavirus Cases, Chennai Coronavirus News, Chennai Coronavirus Updates, Chennai Covid 19, Chennai Covid 19 Cases, Chennai New Covid 19 Cases

భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1458 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై నగరంలోనే ఈ రోజు 1146 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 30,152 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 20,993 కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో నమోదైన 19 కరోనా మరణాలతో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 251 కి చేరింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 633 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 16,395 కి చేరింది. ప్రస్తుతం 13,503 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + twenty =