పేక ముక్కలతో మేడను కాదు.. ఏకంగా కోటనే నిర్మించిన బాలుడు.. వీడియో వైరల్

A Boy Built a castle with cards Goes Viral,A Boy Built a Castle,Castle with Cards Goes Viral,A Boy Built a castle,Mango News,Mango News Telugu,Boy Built a Castle Together Video Viral,Built a Castle Together,a Boy Who Built a Fort,Fort out of Dice,Built a Fort,Guinness Book of World Record, Kolktta, Playing Cards, Social Media, Viral Video,Boy Built a Castle Latest News,Boy Built a Castle Latest Updates,Boy Built a Castle Live News
arnav

ట్యాలెంట్ ఎవడబ్బ సొత్తుకాదు.. ఈ డైలాగ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎంత ట్యాలెంట్ ఉన్నా ఒకప్పుడు అవకాశాలు లేక చాలా మంది చెప్పులు అరిగేలా తిరిగేవారు. కానీ ఇప్పుడు ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసింది. అవకాశాలే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ఓవర్ నైట్‌లో ఫేమస్ అయిపోతున్నారు. అవకాశాలను వెతుక్కోవడం పక్కన బెట్టి.. అవకాశాలనే తమ వద్దకు రప్పించుకుంటున్నారు. ఇక సాధారణంగా మనం ఏదైనా కొత్త పనిని మొదలు పెడుతున్నామంటే.. కొందరు ఆకాశంలో పేక మేడలు కడుతున్నావా అని ఎద్దేవా చేస్తుంటారు. కానీ ఓ కుర్రాడు పేకలతో మేడను కాదు.. ఏకంగా ఓ కోటనే నిర్మించి అద్భుతం సృష్టించాడు. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకున్నాడు.

అర్నవ్ డాగా అనే బాలుడు కోల్‌కతాలో టెన్త్ క్లాస్ చుదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి అర్నవ్ చదువులో, గేమ్స్‌లో అన్నింటిలోనూ ముందుండే వాడు. కొత్త కొత్త ప్రయోగాలు చేయడం అంటే అతనికి ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి అర్నవ్ ఎన్నో కొత్త ప్రయోగాలు చేశాడు. చిన్నప్పుడు పేకలతో అందరూ మేడలు కట్టే ఉంటారు. ఇలానే పేకలను చూడగానే అర్నవ్‌కు ఓ ఆలోచన కలిగింది. వాటిలో పెద్ద కోటను ఎందుకు కట్టలేమనుకున్నాడు. వెంటనే పేకలతో కోటను నిర్మించాలని అర్నవ్ నిర్ణయించుకున్నాడు.

ప్రతి రోజూ స్కూల్‌కి వెళ్లి రాగానే త్వరత్వరగా హోం వర్క్ పూర్తి చేసేవాడు. ఆ తర్వాత పేకలను పట్టుకొని కుస్తీ పట్టేవాడు. ముందు పేకలతో చిన్న చిన్న మేడలను నిర్మించేందుకు ప్రయత్నించాడు. అయితే మేడలు కడుతుండగా అవి కూలిపోతుండడంతో ముందు అర్నవ్ నిరాశ చెందాడు. అయిప్పటికీ పట్టువదలకుండా కోటను నిర్మించాడు. 11 అడుగుల ఎత్తు, 40 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పుతో పేకలతో కోటను నిర్మించాడు. ఇందుకోసం 41 గంటల పాటు అర్నవ్ శ్రమించాడు. అర్నవ్ పేకలతో కోటను కడుతున్నప్పుడు తీసిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అటు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా అర్నవ్‌కు చోటు దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 4 =