ఏ క్రెడిట్ కార్డు ఎలా ఉపయోగపడుతుంది?

Are there so many types of credit cards,so many types of credit cards,types of credit cards,credit cards,credit card useful,Secured Credit Cards, Prepaid Credit Cards, Business Credit Cards,Mango News,Mango News Telugu,Credit Cards Latest News,Credit Cards Latest Updates,Types of Credit Cards News Today,Types of Credit Cards Latest News
Are there so many types of credit cards?

ఇండియాలో చాలా గవర్నమెంటు బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు తమ కస్టమర్లకు.. డెబిట్ కార్డులు మాత్రమే కాకుండా క్రెడిట్ కార్డులు కూడా అందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఎన్ని రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయో.. వాటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయో చాలా మందికి అవగాహన ఉండదు. కానీ ఇలాంటి వాటిపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రెగ్యులర్ క్రెడిట్ కార్డులు అంటే అందరికీ తెలుసు. ఈ రెగ్యులర్ క్రెడిట్ కార్డులు.. రివార్డ్ పాయింట్స్, ఫ్యూయెల్ సర్‌ఛార్జ్ మినహాయింపులు వంటి ఎక్స్‌ట్రా బెనిఫిట్స్‌ను అందిస్తాయి. అయితే తమ లైఫ్ పార్టనర్ కోసం, మేజర్ అయిన పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, లేదా ఇతర కుటుంబసభ్యులతో పంచుకోవడానికి మూడు ఫ్రీ యాడ్-ఆన్ కార్డ్‌లను కూడా పొందొచ్చన్న విషయం చాలామందికి తెలియదు. వీటివల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను కూడా పొందొచ్చు.

అలాగే సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డులు ఉన్నవాళ్లకు ఫ్యాన్సీ లాంజ్‌లకు ఫ్రీ యాక్సెస్, గోల్ఫ్ ఫ్రీ రౌండ్‌లు, రివార్డ్‌లు, పెద్ద రెస్టారెంట్‌లలో కూల్ డిస్కౌంట్‌లు వంటి ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయి. అయితే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలనుకునే వారికి ఈ సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డులు ఉపయోగపడతాయి.

కో-బ్రాండెడ్ కార్డ్‌ల విషయానికి వస్తే.. కొన్ని రకాల అంశాలకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఫ్లైట్ జర్నీలు చేసిన వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. విమాన టికెట్లు, ప్రయాణాల మీద కొన్ని డిస్కౌంట్స్‌తో పాటు.. స్పెషల్ చెక్-ఇన్ కౌంటర్స్, ఎక్స్‌ట్రా లగేజీ అలవెన్స్, లాంజ్‌లకు ఫ్రీ యాక్సెస్ వంటి అద్భుతమైన బెనిఫిట్స్  కో-బ్రాండెడ్ కార్డుల ద్వారా పొందవచ్చు.

అలాగే  అవసరాల కోసం ఖర్చు చేసే టైములో కమర్షియల్ లేదా బిజినెస్ కార్డులు చాలా బాగా ఉపయోగపడతాయి. బిజినెస్ యాడ్స్, కొనుగోళ్ల సమయంలో మనీ సేవింగ్  చేసుకోవడంలో  ఈ కార్డు  చాలా సహాయపడుతుంది. అలాగే ట్రాన్జాక్ష్సన్స్ కూడా ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. వీటిలో ఎక్స్ ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

ప్రీపెయిడ్ కార్డులు.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగపడతాయి. లిమిటెడ్ క్రెడిట్‌ నిర్ధారించుకుంటూ వాడే ఈ కార్డులను  మీ పిల్లలకు ఇవ్వవచ్చు. దీంతో వాళ్లు ఎక్కువ ఖర్చు చేద్దామన్నా లిమిట్ ఉంటుంది కాబట్టి అంతే ఖర్చు చేస్తారు.కొన్ని కంపెనీలు కూడా  తమ రోజువారీ ఖర్చులను కవర్ చేయడానికి  ఇలాంటి కార్డులు వాడుతూ ఉంటారు.

అలాగే ఎక్కువ డబ్బు సంపాదన కలిగి, ఎక్కువ పనుల కోసం కారు పొందాలనుకునే వాళ్లు.. ప్రీమియం క్రెడిట్ కార్డులను పొందవచ్చు. మెరుగైన రివార్డ్స్, అదనపు బెనిఫిట్స్  కోసం ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి.

అత్యవసర సమయంలో సెక్యూర్డ్  క్రెడిట్ కార్డులు చాలా ఉపయోగపడతాయి. క్రెడిట్ స్కోర్ ఎక్కువ లేనివారికి కూడా బ్యాంకులు ఈ కార్డులను  అందిస్తాయి.  కాకపోతే బిల్లులు సకాలంలో చెల్లిస్తామని బ్యాంకుకు గ్యారెంటీ ఇవ్వాలి. అందుకే చాలా బ్యాంకులు తమ దగ్గర ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఉన్నవాళ్లకే ఈ కార్డులు అందిస్తాయి. దీనిద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో జమ చేసిన డబ్బు.. క్రెడిట్ కార్డుకు కొలేటరల్‌గా బ్యాంకులు భావిస్తాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 18 =