మార్చి 16న పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భగవంత్ మాన్

Bhagwant Mann to Take Oath as New CM of Punjab on March 16, Bhagwant Mann to Take Oath as New CM of Punjab, New CM of Punjab, Bhagwant Mann, Bhagwant Mann New CM of Punjab, Punjab Assembly Elections Results 2022, Punjab Election 2022 Results Updates, AAP Party Lead In Punjab Election 2022, Punjab Assembly Elections-2022 Results Updates, Punjab Assembly Elections-2022 Results Updates In Punjab, Punjab Assembly Elections-2022, Assembly election 2022 live updates, Assembly election 2022 Latest updates, Assembly election 2022 Latest News, Punjab Election 2022, 2022 Punjab Election, Punjab, Punjab Assembly Elections 2022, 2022 Punjab Assembly Elections, Punjab Assembly Elections, Punjab Assembly Elections Latest News, Punjab Assembly Elections Latest Updates, Punjab Assembly Elections Live Updates, 2022 Assembly Elections, Assembly Elections, Elections, Mango News, Mango News Telugu,

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను ఆప్ 92 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికలకు ముందే తమ పార్టీ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ఆప్ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో భగవంత్ మాన్ ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై 58,206 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో స్పష్టమైన మెజార్టీతో పంజాబ్ సీఎం బాధ్యతలు చేపట్టేందుకు భగవంత్ మాన్ సిద్ధమవుతున్నారు. మార్చి 16, బుధవారం నాడు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం నాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆప్ ఎమ్మెల్యేలంతా చండీగఢ్‌లోని మొహాలీ క్లబ్‌లో సమావేశమై తమ శాసనసభాపక్ష నేతగా భగవంత్ మాన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి భగవంత్ మాన్‌ శనివారం గవర్నర్‌ ను కలవనున్నట్లు తెలుస్తుంది.

అయితే సీఎంగా ప్రమాణస్వీకారం రాజ్‌భవన్‌లో కాకుండా స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామమైన నవాన్‌షహర్ జిల్లాలోని ఖట్కర్ కలాన్‌లో చేయనున్నట్లు మాన్‌ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ను ఇప్పటికే ఆహ్వానించారు. అలాగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందుగా అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి భగవంత్ మాన్‌ మార్చి 13వ తేదీన అమృత్‌సర్‌ లో రోడ్‌షో కూడా నిర్వహించనున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =