బీహార్ సీఎం నితీశ్ కుమార్ సభలో బాంబు కలకలం.. ప్రధాన వేదికకు అతి సమీపంలో పేలుడు

Bihar Bomb Hurled Near CM Nitish Kumar's Jansabha in Nalanda Today, Bihar Bomb Hurled Near CM Nitish Kumar's Jansabha in Nalanda, Bomb Hurled Near CM Nitish Kumar's Jansabha in Nalanda, Bomb Hurled Near CM Nitish Kumar's Jansabha, Jansabha in Nalanda, Bihar Bomb, Bomb Hurled Near CM Nitish Kumar's Jansabha, A bomb was hurled near Bihar chief minister Nitish Kumar's Jansabha site in Nalanda, Nitish Kumar's Jansabha, Bihar chief minister Nitish Kumar, Bihar chief minister, Nitish Kumar,, CM Nitish Kumar, Nalanda Jansabha News, Nalanda Jansabha Latest News, Nalanda Jansabha Latest Updates, Nalanda Jansabha Live Updates, Mango News, Mango News Telugu,

నలందలోని బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ) చీఫ్ నితీశ్ కుమార్ పాల్గొన్న ఒక బహిరంగసభలో బాంబు కలకలం సృష్టించింది. సీఎం నితీశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జనసభ’ ప్రాంగణంలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ముఖ్యమంత్రికి అతి సమీపంలో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా వేదికపై ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. ముఖ్యమంత్రికి ఐదు అడుగుల దూరంలోనే ఈ బాంబు పేలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ బాంబు దాడితో అధికార వర్గాలు నివ్వెరపోయాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.  కాగా నలంద బాంబు దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని,  దీనిపై అత్యున్నత విచారణకు ఆదేశించించామని బీహార్ ప్రభుత్వం తెలిపింది. పాట్నా జిల్లాలోని భక్తియార్‌పూర్ బ్లాక్‌లో ఇటీవలే సీఎం నితీశ్ కుమార్‌పై ఒక వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి అంతకన్నా పెద్ద పరిణామం జరిగడంతో ముఖ్యమంత్రి భద్రతా లోపాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

మార్చి 21న పాట్నా జిల్లాలోని భక్తియార్‌పూర్ బ్లాక్‌లో సిఎం నితీశ్ కుమార్ ఓ వ్యక్తి వ్యక్తిగతంగా దాడి చేశాడు. నితీశ్, శిల్పద్ర యాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న సమయంలో, వెనుక నుండి ఒక వ్యక్తి పరుగెత్తుతూ వచ్చి సీఎం ముఖంపై కొట్టడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. కానీ, దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ఘటనకు బాధ్యుడైన వ్యక్తిపై కేసులు పెట్టబోమని సీఎం ప్రకటించారు. బీహార్ ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం, దాడి చేసిన వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని దర్యాప్తులో తేలింది. నిందితుడిపై గతంలో ఎలాంటి నేర చరిత్ర లేనందున, కావాలని చేసిన దాడి కాదని నిర్ధారణకు వచ్చారు. అతనిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని, అతనికి వైద్య సహాయం కూడా అందించాలని సీఎం నితీశ్ అప్పుడు అధికారులకు ఆదేశాలిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 11 =