విద్యుత్, అటవీ, గనులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Peddireddy Ramachandra Reddy Takes Charge as Energy Forest Science and Technology Minister, Peddireddy Ramachandra Reddy Takes Charge as Energy Minister, Peddireddy Ramachandra Reddy Takes Charge as Forest Minister, Peddireddy Ramachandra Reddy Takes Charge as Science and Technology Minister, peddireddy ramachandra reddy minister post, peddireddy ramachandra reddy, Andhra Pradesh Cabinet, Cabinet reshuffle, AP Cabinet reshuffle News, AP Cabinet reshuffle Latest News, AP Cabinet reshuffle Latest Updates, AP Cabinet reshuffle Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా, వారికీ శాఖల కేటాయింపు కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు మంగళవారం నాడు బాధ్యతలు చేపట్టారు. గ‌త మంత్రివ‌ర్గంలో ప‌నిచేసిన వైఎస్సార్సీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి మంత్రిగా అవకాశం దక్కించుకోగా, ఆయనకు విద్యుత్, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులు అండ్ జియాలజీ శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ఉదయం సచివాలయంలోని మూడో బ్లాక్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ముందుగా సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి పెద్దిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దిరెడ్డి కుటుంబసభ్యులు, ఎంపీ మిథున్‌రెడ్డి, సంబంధిత శాఖలకు చెందిన అధికారులు హాజరై మంత్రి పెద్దిరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం వైస్ జగన్ కేబినెట్ తో పాటుగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య కేబినెట్ లలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉంది. మరోవైపు మంగళవారం మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినవారిలో రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − six =