చార్టెడ్‌ అకౌంటెంట్ ఫైనల్‌, ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా : ఐసీఏఐ

CA Intermediate Final Exams Postponed, CA Intermediate Final Exams Postponed In the View of Ongoing COVID-19 Pandemic, Final Exams 2021 Postpoed, ICAI CA Exams 2021, ICAI CA Intermediate, ICAI CA Intermediate and Final exams postponed, ICAI CA Intermediate Final exams 2021 postponed, ICAI CA Intermediate Final Exams Postponed, ICAI CA May exams 2021, Mango News

దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు, పలు రాష్ట్రాల్లో నిర్వహించే పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా చార్టెడ్‌ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) మంగళవారం నాడు ప్రకటించింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల భద్రతను, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మే 21 నుంచి జరగాల్సిన ఛార్టెడ్‌ అకౌంటెంట్ ఫైనల్‌ పరీక్షలు, అలాగే మే 22 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్‌ ఛార్టెడ్‌ అకౌంటెంట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

కరోనా కేసులు, హోమ్ శాఖ మార్గదర్శకాలు, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కరోనా పరిస్థితిని సమీక్షించుకుని కొత్త తేదీలను ప్రకటిస్తామని ఐసీఏఐ వెల్లడించింది. అయితే పరీక్షలు ప్రారంభానికి కనీసం 25 రోజుల ముందు నోటీసు ఇవ్వబడుతుందని తెలిపారు. విద్యార్థులు పరీక్షల వాయిదాని గమనించాలని, అదేవిధంగా అప్‌డేట్స్‌ కోసం ఇన్స్టిట్యూట్ అధికారిక వెబ్‌సైట్ www.icai.org సందర్శిస్తూ ఉండాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =