ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు కనీసం జూలై వరకు వాయిదా వేయాలి : కేఏ పాల్

AP Tenth and Inter Exams, Ap Tenth Inter Exams New Changes, CBSE Board Exams -2021, Dr KA Paul Press Meet, Dr KA Paul Press Meet on Postpone of Tenth and Inter Exams, Dr KA Paul Press Meet on Postpone of Tenth and Inter Exams in AP, KA Paul, KA Paul Latest News, KA Paul Press Meet, Mango News, Postpone of Tenth and Inter Exams

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్ కరోనా పరిస్థితులపై బుధవారం నాడు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని సీఎం వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశామన్నారు. ఈ పరీక్షలకు దాదాపు 35 లక్షల మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉందని, కనీసం జూలై వరకు వాయిదా వేయాలని కోరారు. మే 5 నుంచి పరీక్షలు వాయిదా వేయకపోతే విద్యార్థులు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడే క్రమంలో వారి కుటుంబ సభ్యులు కూడా వైరస్ బారినపడే అవకాశం ఉందన్నారు. అనేక రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేయడం, రద్దు చేయడం జరిగిందన్నారు. అలాగే పరీక్షల వాయిదాపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు.

ప్రస్తుతం కరోనా సునామీ కన్నా ప్రమాదకరంగా మారింది, దేశంలో లక్షలమంది ప్రాణాలు కోల్పోయారని కేఏ పాల్ అన్నారు. ఎన్నికల సమయాల్లో బహిరంగ సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం కూడా కరోనా ప్రభలడానికి కారణమైందని అన్నారు. ప్రజలు సమావేశాలు, ర్యాలీలను రద్దు చేసుకోవాలని సూచించారు. రెండు నెలలుగా ఎన్నో రాష్ట్రాలు తిరిగానని, ఎందరో ముఖ్యమంత్రులను కలిశానని చెప్పారు. దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. ఏపీ హైకోర్టు పరీక్షలపై నిర్ణయం తీసుకోకుంటే విద్యార్థులు కరోనా వలన ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడంపై కూడా హైకోర్టులో పిటిషన్ వేశాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకుంటామని కేఏ పాల్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =