సీబీఎస్‌ఈ బోర్డు 10,12 వ తరగతుల పరీక్షలు నిర్వహించే తేదీపై డిసెంబర్ 31 న ప్రకటన

CBSE Board Exams -2021 Dates to be Announced on December 31,CBSE Board Exam Dates To Be Announced On December 31,CBSE Board Exam Dates To Be Announced On Dec 31,Education Minister,Dates For CBSE Board Exams To Be Announced On 31st December 2020,CBSE Board Exam Dates For Class 10 And 12 To Be Announced On December 31,Date For CBSE Board Exams To Be Announced On December 31,CBSE Board Exam Dates To Be Announced,CBSE Board Exam Dates,Education Minister To Announce Class 10 And 12 Schedule On December 31,CBSE Board Examination Dates To Be Introduced,CBSE Exam Date 2021,Cbse Exams 2021,Mango News,Mango News Telugu,CBSE Board Exams -2021,CBSE Board Exams

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ శనివారం నాడు కీలక ప్రకటన చేశారు. సీబీఎస్‌ఈ బోర్డు 10, 12 వ తరగతుల పరీక్షలు నిర్వహించే తేదీని వెల్లడిస్తానని పేర్కొన్నారు. “విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రధాన ప్రకటన. 2021లో సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యే తేదీని డిసెంబర్‌ 31, గురువారం సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తాను” అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. గతకొన్ని రోజులుగా 2021 సీబీఎస్‌ఈ పరీక్షలపై దేశవ్యాప్తంగా చర్చనడుస్తుంది. ఈ అంశంపై ఇటీవలే ఉపాధ్యాయులతో వర్చువల్‌ సమావేశం ద్వారా కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ చర్చించారు. అనంతరం సీబీఎస్‌ఈ 10,12 తరగతి విద్యార్థులకు జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో పరీక్షలు ఉండవని స్పష్టంచేశారు. ఈ నేపధ్యంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి తేదీని ప్రకటిస్తానని మంత్రి రమేష్ పోఖ్రియాల్‌ చెప్పడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 13 =