వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు పర్యటిస్తున్న మంత్రి కేటిఆర్

Flood Situation in Hyderabad City, Heavy Rains In Hyderabad, Heavy rains lash Hyderabad, Hyderabad Rain Today, Hyderabad Rains, Hyderabad Rains news, Hyderabad records highest rainfall, KTR Reviewed Reviewed Flood Situation in Hyderabad, Minister KTR, Telangana rains, telangana rains news, telangana rains updates

హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో వరుసగా మూడో రోజు కూడా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ పర్యటిస్తున్నారు. మూడో రోజు వరద ప్రభావిత ప్రాంత పరిశీలనలో భాగంగా ఖైరతాబాద్, బేగంపేట్, ప్రకాష్ నగర్ లలో మంత్రి కేటిఆర్ పర్యటించారు. ఖైరతాబాద్ బిఎస్ మక్తలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్ ను మంత్రి సందర్శించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

వరదల వలన ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి రేషన్ కిట్లతో పాటు ఇతర సౌకర్యాలను అందించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసిందని మంత్రి కేటిఆర్ అన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కాలనీల్లో వరద నీరు తగ్గుతున్నాయని, వెంటనే పారిశుద్ధ్య పనులు కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. బేగంపేటలో పరిస్థితులను పరిశీలించిన అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటిఆర్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 2 =