చంద్రుడికి 177 కిలో మీటర్ల దూరంలో చంద్రయాన్-3..!

Chandrayaan 3 Just 177 Km Away From Moons Surface ISRO Shares Big Update of Crucial Manoeuvre,Chandrayaan 3 Just 177 Km Away From Moons Surface,ISRO Shares Big Update of Crucial Manoeuvre,Chandrayaan 3 Just 177 Km Away,ISRO Shares Big Update,Mango News,Mango News Telugu,Chandrayaan 3 gets closer to Moon,Chandrayaan 3 just 177 kilometers,Chandrayaan-3 is 177 km away from the moon,Chandrayaan-3 , moon, Chandrayaan-3 was launched on July 14, Chandrayaan-3 was launched into lunar orbit on August 5, Lander soft landing, roll out from rover on 23rd August,Chandrayaan 3 Latest News,Chandrayaan 3 Latest Updates

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రస్తుతం చంద్రుడికి 177 కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రయాన్-3 అంతరిక్ష నౌకను 150 కి.మీ. x 177 కి.మీ. కక్ష్యలో ఉంచారు. ఈ రోజు (బుధవారం) ఈ దూరాన్ని 100 కిలోమీటర్లకు తగ్గించనున్నారు. ఆ తర్వాత ల్యాండర్ విడిపోయి చంద్రుడిపై ల్యాండ్ కానుంది. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు చేయనుంది.

చంద్రుడిపై సాఫ్ట్‌గా దిగేందుకు ల్యాండర్ వేగాన్ని తగ్గించుకుంటూ ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్​ అవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టారు. చంద్రయాన్-3 ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టారు. ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్, రోవర్ నుంచి రోల్ అవుట్ ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.47 గంటలకు జరగనుంది. విజయవంతమైతే, యుఎస్‌ఎస్‌ఆర్, యుఎస్, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన ప్రపంచంలో నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.

భారత్‌కు పోటీగా ఆగస్టు 11న చంద్రుడిపైకి లునా-25 రాకెట్‌ను రష్యా విజయవంతంగా ప్రయోగించింది. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలో వోస్తోక్నీ కాస్మో డ్రోమ్ నుంచి ఈ ప్రయోగం చేసినట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ పేర్కొంది. ఈ ప్రయోగాన్ని గత శుక్రవారం తెల్లవారుజామున 2:10 గంటలకు చేశారు. లూనా-25 ల్యాండర్ 1,752 కిలోల బరువుతో పోలిస్తే, నాలుగు కాళ్ల రష్యన్ ల్యాండర్ 800 కిలోల బరువు ఉంటుందని తెలిపారు. లూనా-25 వల్ల చంద్రయాన్-3కి ఎలాంటి ఇబ్బంది ఉండదని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ తెలిపింది. 1.8 టన్నుల బరువుతో, 31 కిలోల శాస్త్రీయ పరికరాలను మోసుకెళ్లే లూనా-25 మానవ జీవితానికి తోడ్పడే ఘనీభవించిన నీటి ఉనికిని పరీక్షించడానికి 15 సెం.మీ లోతు నుంచి రాతి నమూనాలను తీయడానికి ఒక స్కూప్‌ను ఉపయోగించనున్నారు. వాస్తవానికి లూనా-25ను అక్టోబర్ 2021కి ప్రయోగించాల్సి ఉంది. కానీ దాదాపు రెండేళ్లపాటు ఈ ప్రయోగం వాయిదా పడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − five =