ఏది గుండె నొప్పో, ఏది గ్యాస్ నొప్పో తెలియక టెన్షన్ పడుతున్నారా? లేక లైట్ తీసుకుంటున్నారా?

Do You Know The Difference Between The Chest Pain and Gas Problem,Do You Know The Difference,Difference Between The Chest Pain and Gas Problem,Chest Pain and Gas Problem,Mango News,Mango News Telugu,Is It Gas Pain or a Heart Problem,Gas pain in your chest,Heart attack or heartburn,Difference between heartburn and gas pain, heart pain, gas pain, which one is heart pain, which one is gas pain,Signs of heart attack

ప్రస్తుతం ఎక్కడ వార్తలు చూసినా చిన్న వయసులోనే గుండెనొప్పితో మరణించినవారి గురించే ఉంటున్నాయి. అయితే ఇలా మృతిచెందినవారిలో గుండెపోటుకు, గ్యాస్ వల్ల వచ్చే నొప్పికి మధ్య తేడా ను గమనించలేకపోతున్నారు. ప్రస్తుత జీవన విధానం ఎంతో వైవిధ్యంగా ఉండటంతోపాటు ఆహారపు అలవాట్లు కూడా మారిపోయి అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. నొప్పి వస్తున్నా ఇది నార్మల్‌గా వచ్చే నొప్పే కదా అని అనుకుంటున్నారు.

ఇలాంటి నొప్పి కొన్నిసార్లు గుండెపోటుకు దారితీస్తుంది. అందుకు ముందుగానే కొన్ని లక్షణాలు కనపడతాయి.. వాటిని జాగ్రత్తగా గమనించాలి. కొందరికి భుజాల నుంచి తలవరకు నొప్పి వస్తుంది. మరికొందరిలో చెమటలు పట్టడం, ఆవలింతలు రావడం, తేన్పులవంటి లక్షణాలు కనపడతాయి. చాలామంది ఇటువంటి సంకేతాలు కనిపించినప్పటికీ గ్యాస్ వల్లే అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తుంటారు. తీవ్రత ఎక్కువైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. శీతల పానీయాలవల్ల కూడా గుండెనొప్పులు వచ్చే ప్రమాదం ఉందని, వాటిని తీసుకోవడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడానికి వైద్యులు చెప్పిన కొన్ని విలువైన సూచనలు ఇవే..

  • గుండె నొప్పి అయితే ఛాతీతో పాటు ఎడమ చెయ్యి ఎడమ వైపు బ్యాక్‌ అంతా ఒకేసారి నొప్పి ఉండటంతోపాటు ఛాతీ అంతా బరువుతో కూడిన నొప్పి ఉంటుంది.
  • గ్యాస్‌ నొప్పి మనం వేలుతో పాయింట్‌ చేసేంత స్థలంలోనే ఉంటుంది. ఓసారి ఓ దగ్గర ఇంకోసారి ఇంకో దగ్గర ఆ నొప్పి ఉంటుంది.
  • ముందుకు వంగినప్పుడు కూర్చున్నప్పుడు ఛాతీలో ఉండే నొప్పి పడుకున్నప్పుడు వీపు భాగంలో ఉంటుంది.
  • పడుకున్నప్పుడు గ్యాస్ వెనక్కి వెళ్తుంది. కానీ గుండె నొప్పి పడుకున్నా లేచినా ఒకేచోట ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + two =