ఢిల్లీ మద్యం కుంభకోణంలో హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా మరోసారి ఈడీ దాడులు, సీఎం కేజ్రీవాల్ విమర్శలు

CM Arvind Kejriwal Slams Centre Over ED Raids Across India Including Hyderabad in Delhi Liquor Scam, CM Arvind Kejriwal Slams Centre Over ED Raids, TRS MLC Kalvakuntla Kavitha, MLC Kalvakuntla Kavitha, Kalvakuntla Kavitha on ED Notice, Kalvakuntla Kavitha Latest News And Updates, Mango News, Mango News Telugu, TRS MLC Kavitha, TRS MLC Kavitha Delhi Liqour Scam Case, Delhi Liquor Scam, Delhi Liquor Scam ED Rides, Delhi Liquor Scam Ed Raids In Telangana, Ed Raids In Telangana, Enforcement Directorate Hyd, Enforcement Directorate

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరింత ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే రెండుసార్లు దాడులు నిర్వహించిన ఈడీ తాజాగా మరోసారి దాడులు కొనసాగిస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 35కు పైగా ప్రాంతాల్లో శుక్రవారం సోదాలు చేపట్టింది. ఈ రాష్ట్రాల్లోని మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, సరఫరా గొలుసు నెట్‌వర్క్‌లకు సంబంధించిన ప్రాంగణాల్లో ఈ తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్, కూకట్ పల్లి సహా మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది.

ఇదిలా ఉండగా మరోవైపు దీనిపై, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈడీ చేస్తున్న దాడులను ‘డర్టీ పాలిటిక్స్’గా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో.. ‘3 నెలల నుండి 500 కంటే ఎక్కువ దాడులు, 300 కంటే ఎక్కువ మంది సిబిఐ/ఇడి అధికారులు 24 గంటలు పనిచేస్తున్నారు. అయినా మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యాన్ని కూడా కనుగొనలేకపోయారు. ఎందుకంటే మేమి ఏ తప్పు చేయలేదు” అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన నేపథ్యంలో గతేడాది నవంబర్ 17 నుంచి అమలు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని ఈ ఏడాది జూలైలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రద్దు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + fifteen =