రసవత్తరంగా యూపీ ఎన్నికలు – అసెంబ్లీ బరిలోకి అఖిలేష్‌

2022 UP assembly election, 2022 Up Assembly Elections, Akhilesh Yadav likely to contest UP Assembly elections, Akhilesh Yadav to Contest UP Assembly Elections, Akhilesh Yadav To Contest UP Polls, Akhilesh Yadav to contest Uttar Pradesh Assembly elections, Mango News, Samajwadi Party chief Akhilesh Yadav, SP Chief Akhilesh Yadav, SP Chief Akhilesh Yadav to be Contest First Time in UP Assembly Election, SP chief Akhilesh Yadav to contest UP elections, UP Assembly Election, UP assembly election 2022, UP Assembly Elections 2022, UP Election 2022

యూపీ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్‌ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఈసారి ఎన్నికలలో అఖిలేష్‌ యాదవ్ పోటీచేస్తారని ఎస్పీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆజంగఢ్‌ ఎంపీగా ఉన్న అఖిలేష్ శాసనసభ ఎన్నికల్లో పోటీచేయడంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. అయితే అఖిలేష్‌ ఎక్కడి నుంచి పోటీచేస్తారనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. పార్టీ ముఖ్యుల అంచనా ప్రకారం.. అఖిలేష్ యాదవ్ తూర్పు యూపీ నుంచి లేదా హై-ప్రొఫైల్ కలిగిన లక్నో వంటి సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎంచుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ సీట్ల నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటివరకు అధికారపగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రులంతా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపించలేదు. యూపీలో 2007 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారపగ్గాలు చేపట్టిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల్లో ప్రత్యక్ష పోరుకు దిగలేదు. శానమండలి సభ్యురాలిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ ఆమె అసెంబ్లీకి పోటీ చేయలేదు. ఇక ఐదుసార్లు ఎంపీగా గెలిచిన ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సైతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే, మొట్టమొదటిసారిగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్ నుంచి ఈసారి ఎన్నికల బరిలోకి దిగడంతో ఈ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =