రేపు కర్నూల్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన, గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన

CM YS Jagan To Visit Kurnool Tomorrow will Lay Foundation Stone for Greenko Energies Ltd Energy Project, CM YS Jagan To Visit Kurnool Tomorrow, CM YS Jagan will Lay Foundation Stone for Greenko Energies Ltd Energy Project, Greenko Energies Ltd Energy Project, Greenko Energies Ltd, YS Jagan To Visit Kurnool Tomorrow, AP CM YS Jagan To Visit Kurnool Tomorrow, AP CM To Visit Kurnool Tomorrow, AP CM YS Jagan Kurnool Tour, AP CM YS Jagan Kurnool Tour News, AP CM YS Jagan Kurnool Tour Latest News, AP CM YS Jagan Kurnool Tour Latest Updates, AP CM YS Jagan Kurnool Tour Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, AP CM, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (మే 17, మంగళవారం) కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండా సమీపంలో గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ యొక్క ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 5,410 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన లక్ష్యంగా గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. సీఎం కర్నూల్ జిల్లా పర్యటన నేపథ్యంలో స్థానిక నేతలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ముందుగా మంగళవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ 9.35 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో గుమ్మటం తండా హెలిప్యాడ్‌కు చేరుకుని కొద్దిసేపు స్థానిక నేతలతో మాట్లాడతారు. అనంతరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక సీఎం వైఎస్ జగన్ తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − three =