కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బరిలోకి ఎంపీ శశి థరూర్‌, సోనియాగాంధీ అనుమతి లభ్యం?

Congress Party Presidential Election: Lok Sabha MP Shashi Tharoor Likely to Contest, Shashi Tharoor Gets Sonia Gandhi Nod To Contest, Shashi Tharoor To Contest Congress Presidential Election, Shashi Tharoor Congress Presidential Elections, Shashi Tharoor Congress President Candidate, Mango News, Mango News Telugu, Former Congress President Sonia Gandhi, Shashi Tharoor , Sonia Gandhi, Shashi Tharoor Latest News And Updates, Sonia Gandhi News, Congress Presidential Election, Rahul Gandhi Bharat Jodo Yatra

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక రోజురోజుకి రసవత్తరంగా మారుతుంది. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికై లోక్‌సభ ఎంపీ శశి థరూర్‌తో బరిలో దిగనున్నట్టు తెలుస్తుంది. శశి థరూర్‌ సోమవారం నాడు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాను పోటీ చేసే ఆలోచనలో ఉన్నానని శశి థరూర్‌ సోనియా గాంధీకి తెలుపగా, ఆయనకు అనుమతి లభించినట్లు తెలుస్తుంది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరైనా పోటీలో ఉండొచ్చని, పోటీ జరిగినప్పుడు తాను తటస్థంగా ఉంటానని సోనియా గాంధీ హామీ ఇచ్చినట్టు సమాచారం.

మరోవైపు అధ్యక్ష పదవి రేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉండొచ్చని నేతలు భావిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ మాజీ అధ్యక్షుడు, కీలక నేత రాహుల్ గాంధీపై రోజురోజుకీ మరింత ఒత్తిడి పెరుగుతోంది. తన మనసు మార్చుకుని పోటీలో ఉండి, పార్టీ బాధ్యతల్ని చేపట్టాలని రాహుల్‌ గాంధీని పలు రాష్ట్రాల పీసీసీలు కోరుతున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీకి మద్దతు తెలుపుతూ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌,బీహార్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు మరియు మహారాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలు తీర్మానం చేశాయి. ఇక రాహుల్ గాంధీ పోటీ చేయకూడదనే తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రంగంలోకి దిగే అవకాశం ఉందని సీనియర్ నేతలు భావిస్తున్నారు. దీని ప్రకారం సీనియ‌ర్ నేతలైన శ‌శి థ‌రూర్‌, అశోక్ గెహ్లాట్‌ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీపడితే 22 సంవత్సరాల అనంతరం, సీతారామ్ కేస‌రి తర్వాత మళ్ళీ గాంధీయేత‌ర కుటుంబ వ్యక్తి పార్టీ అత్యున్నత పదవిని చేపట్టే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్:

  • నోటిఫికేషన్ విడుదల : సెప్టెంబర్ 22
  • నామినేషన్ల దాఖలుకు గడువు: సెప్టెంబరు 24 నుండి సెప్టెంబర్ 30 వరకు
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 1
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 8
  • ఎన్నికల ఓటింగ్ (ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే): అక్టోబర్ 17
  • ఓట్ల కౌంటింగ్, ఫలితాల వెల్లడి: అక్టోబర్ 19

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 8 =