ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను వణికిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం భారత్ లో కూడా క్రమ క్రమంగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటి వరకు ఇరవై రెండు రాష్ట్రాల్లో 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ప్రభావాన్ని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్‌తో పాటుగా ఇతర ఉన్నతాధికారులు మార్చ్ 22, ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. దేశంలో అత్యవసర సర్వీసులు మినహా అన్నింటినీ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. రైలు ప్రయాణికుల ద్వారా కరోనా వైరస్ ఎక్కువుగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు దేశంలో అన్ని రకాల పాసెంజర్ రైళ్లును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న సబర్బన్, మెట్రో రైలు సేవలను కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన జిల్లాలు:
- ఆంధ్రప్రదేశ్ : ప్రకాశం, విజయవాడ, వైజాగ్ (మార్చ్ 31 వరకు రాష్ట్రమంతా లాక్డౌన్)
- చండీగఢ్ : చండీగఢ్
- ఛత్తీస్ ఘడ్ : రాయపూర్
- ఢిల్లీ : సెంట్రల్ ఈస్ట్, ఢిల్లీ నార్త్, వెస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ,
- గుజరాత్ : కచ్, రాజ్ కోట్, గాంధీనగర్, సూరత్, వడోదర, అహ్మదాబాద్
- హర్యానా: ఫరీదాబాద్, సోనిపట్, పంచకుల, పానిపట్, గుర్గాన్
- హిమాచల్ ప్రదేశ్: కాంగ్రా
- కర్ణాటక : బెంగళూరు, చిక్ భల్ల పుర, మైసూర్, కొడగు, కలభురాగి
- కేరళ : అలప్పుజ, ఎర్నాకులం, కన్నూర్, ఈడూకి, కాసర్గోడ్, కొట్టాయం, పతనంతిట్ట, మల్లాపురం, తిరువనంతపురం, త్రిస్సూర్
- మధ్యప్రదేశ్: జబల్పూర్
- మహారాష్ట్ర : అహ్మద్ నగర్, ఔరంగాబాద్, ముంబై, నాగపూర్, ముంబై సబ్-ఉర్బ్, పూణే, రత్నగిరి, రాయఘడ్, థానే, యావత్మల్
- ఒడిశా: ఖుర్ధ
- పుదుచ్చేరి: మాహె
- పంజాబ్: హోషియార్పూర్, సాస్ నగర్, ఎస్బిఎస్ నగర్
- రాజస్థాన్: బిల్వారా, జున్జును, సికార్, జైపూర్
- తమిళనాడు: చెన్నై, ఈరోడ్, కాంచీపురం
- తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగా రెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ (మార్చ్ 31 వరకు రాష్ట్రమంతా లాక్డౌన్)
- ఉత్తర ప్రదేశ్: ఆగ్రా, జిబి నగర్, ఘజియాబాద్, వారణాసి, లఖింపూర్ ఖేరి, లక్నో
- ఉత్తరాఖండ్: డెహ్రాడూన్
- పశ్చిమ బెంగాల్: కోల్ కతా, ఉత్తర 24 పరగణాలు
- జమ్మూ కాశ్మీర్ (యుటి): శ్రీనగర్, జమ్మూ
- లడఖ్(యుటి): కార్గిల్, లేహ్