మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18, ఆదివారం కూడా 68631 కరోనా కేసులు, 503 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38,39,338 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 60,473 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 45,654 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 31,06,828 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 80.92 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.58 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 6,70,388 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఆదివారం నాటికి మహారాష్ట్రలో 2,38,54,185 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ