ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి..?

Deputy CM Post For Udayanidhi Stalin, Deputy CM Udayanidhi Stalin, Udayanidhi Stalin Deputy CM, Tamilnadu, Deputy CM, ML Stalin, Udayanidhi Stalin, DMK Party, Latest Udayanidhi Stalin News, Udayanidhi Stalin News Update, Tamil Nadu Politics, Tamil Nadu Political News, Political News, Mango News, Mango News Telugu
Tamilnadu, Deputy CM, ML Stalin, Udayanidhi Stalin, DMK party

తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ త్వరలో ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ క్రీడా యువజన, సాంస్కృతి వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని ఎంకే స్టాలిన్ భావిస్తున్నారట. వచ్చే నెలలో స్టాలిన్ విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారట. ఈలోగానే తన కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని స్టాలిన్ అనుకుంటున్నారట. దీనిపై ఇప్పటికే  కేబినెట్‌తో స్టాలిన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

జనవరి 21న సేలంలో డీఎంకే యూత్ వింగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ చాలా చురుకుగా ఉంటారని.. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదని డీఎంకే ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎంగోవన్ అన్నారు. ఏది ఏమయినప్పటికీ తుది నిర్ణయం మాత్రమే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీసుకుంటారని చెప్పుకొచ్చారు.

మరోవైపు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. డీఎంకే కుటుంబ పార్టీ అని అన్నాడీఎంకే ఆరోపించింది. కరుణానిధి, ఆయన కుమారులు అళగరి, ఎంకే స్టాలిన్, మేనల్లుడు మరసోలి మారన్.. ఇలా కరుణానిధి కుటుంబ సభ్యులే డీఎంకేను ఏలుతున్నారని మండిపడింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిని.. 2026లో ముఖ్యమంత్రిని చేయాలని స్టాలిన్ అనుకుంటున్నారని అన్నాడీఎంకే విమర్శించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − four =