దసరా పండుగ అనంతరం హుజురాబాద్ ఉపఎన్నిక?

ByPoll Schedule for Bhabanipur Assembly Constituency, EC announces bypoll for Bhabanipur Assembly constituency, EC announces bypoll schedule, EC announces bypoll schedule for 3 West Bengal seats, EC Announces ByPoll Schedule for Bhabanipur Assembly Constituency, EC Announces ByPoll Schedule for Bhabanipur Assembly Constituency in West Bengal, Mango News, West Bengal, West Bengal Assembly ByPoll, West Bengal Assembly ByPoll News

కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నాడు దేశంలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేసింది. పశ్చిమబెంగాల్ లోని భవానీపూర్‌, శంషేర్‌గంజ్‌, జంగీపూర్‌ మరియు ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ స్థానాల్లో సెప్టెంబరు 30న పోలింగ్‌ నిర్వహించనుండగా, అక్టోబరు 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. పోలింగ్‌ జరిగే ఈ ప్రాంతాల్లో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

దసరా పండుగ అనంతరం హుజురాబాద్ ఉపఎన్నిక?:

మరోవైపు పలు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు మరియు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల ఇన్‌పుట్స్, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత దేశంలో ఇంకా జరగాల్సిన 31 అసెంబ్లీ స్థానాల మరియు 3 పార్లమెంటరీ స్థానాల ఉపఎన్నికలను నిర్వహించకూడదని నిర్ణయించనట్టు ఈసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు వరద పరిస్థితులు, పండుగలు మరియు కరోనా మహమ్మారికి సంబంధించిన అడ్డంకులను ఈసీ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. పండుగ సీజన్ ముగిసిన తర్వాత ఉప ఎన్నికలు నిర్వహించడం మంచిదని వారు సూచించినట్టు ఈసీ తెలిపింది. దీంతో తెలంగాణలో జరగాల్సిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక, ఏపీలో జరగాల్సిన బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక దసరా పండుగ అనంతరం జరిగే అవకాశం ఉంది.

కాగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వినతి మేరకు ఆ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికకు ఈ నెలలో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌ లో ఉపఎన్నికల షెడ్యూల్ రావడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సీఎం పదవిలో కొనసాగేందుకు మార్గం సుగమమైంది. గత బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో పోటీచేసిన మమతా బెనర్జీ ఓటమిపాలయ్యారు. పార్టీ సంచలన విజయం సాధించడంతో ఆమె సీఎం పదవీ చేపట్టారు. అయితే సీఎం పదవీలో కొనసాగాలంటే ఆమె ఆరు నెలల్లోగా మళ్లీ అసెంబ్లీకి ఎన్నికావాల్సి ఉంది. భవానీపూర్ స్థానంలో గెలిచిన తృణమూల్‌ నేత సోభాందేవ్‌ ఛటోపాధ్యాయ రాజీనామా చేయడంతో అక్కడ సెప్టెంబర్ 30న ఉపఎన్నిక జరగనుంది. దీంతో మమతాబెనర్జీ భవానీపూర్‌ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =