బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, 3 విడతల్లో ఎన్నికలు

Bihar Assembly Election 2020, Bihar Assembly Elections, Bihar Assembly Elections 2020 Dates, Bihar Assembly Elections Key Dates, Bihar Election 2020 Date Announcement Updates, Bihar election dates 2020, Bihar Election Dates 2020 Announcement, Bihar Elections Date 2020 LIVE Updates, ECI Announced Bihar Assembly Elections 2020, ECI Announced Bihar Assembly Elections 2020 Dates

బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు గానూ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అక్టోబర్‌ 28న తొలి విడతలో 71 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇక రెండో విడతగా నవంబరు 3 న 94 స్థానాలకు, నవంబరు 7 న మూడో విడతలో 78 స్థానాలకు ఎన్నికలు జరపనున్నారు. అలాగే నవంబర్ 10 న ఓట్ల లెక్కింపు పక్రియ నిర్వహించి, ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపారు. కరోనా పరిస్థితుల మధ్య ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచే బీహార్ లో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని సునీల్ అరోరా స్పష్టం చేశారు. కాగా ప్రస్తుత బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 29 తో ముగియనుంది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముఖ్య తేదీలు: ఫేజ్ -1

  • గెజిట్ నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 1
  • నామినేషన్ చివరి రోజు: అక్టోబర్ 8
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 9
  • ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 12
  • ఎన్నికల తేదీ: అక్టోబర్ 28
  • లెక్కింపు తేదీ: నవంబర్ 10

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముఖ్య తేదీలు: ఫేజ్ -2

  • గెజిట్ నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 9
  • నామినేషన్ చివరి రోజు: అక్టోబర్ 16
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 17
  • ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19
  • ఎన్నికల తేదీ: నవంబర్ 3
  • లెక్కింపు తేదీ: నవంబర్ 10

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముఖ్య తేదీలు: ఫేజ్ -3

  • గెజిట్ నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 13
  • నామినేషన్ చివరి రోజు: అక్టోబర్ 20
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 21
  • ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 23
  • ఎన్నికల తేదీ: నవంబర్ 7
  • లెక్కింపు తేదీ: నవంబర్ 10

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + fourteen =