ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత

actor vivek Died, Actor Vivek Died After Heart Attack, Actor Vivek suffers a heart attack, Comedian Vivek Died due to Heart Attack, Famous Tamil Comedian Vivek Passed Away, Famous Tamil Comedian Vivek Died due to Heart Attack, Mango News, Tamil actor Vivek Dies, Tamil Comedian Vivek Death News

ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ (59) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు వివేక్ తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. నటుడిగా, సామాజిక బాధ్యత గల్గిన వ్యకిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన వివేక్ ఆకస్మిక మృతితో తమిళ సినీపరిశ్రమ విషాదంలో మునిగింది. ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ వివేక్‌ ను వెండితెరకు పరిచయం చేశారు. బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మనదిల్‌ ఉరుది వేండం’ అనే చిత్రంతో వివేక్‌ సినీ ఆరంగేట్రం చేశారు.

హాస్యనటుడిగా ఆయన దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, సూర్య వంటి స్టార్స్ తో నటించిన‌ చిత్రాల్లో ప్రత్యేకంగా తనదైన శైలి కామెడీతో వివేక్‌ ప్రేక్షకుల్లో హృదయాల్లో చెరగని ముద్రవేశారు. తమిళంలోనే కాకుండా తెలుగు, ఇతర భాషల్లో కూడా నటుడిగా వివేక్ గుర్తింపు సంపాదించుకున్నారు. వివేక్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 7 =