ఫైజర్‌ కరోనా వ్యాక్సిన్ కు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి, పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు

US FDA Approves Pfizer Covid-19 Vaccine,FDA Clears Pfizer Vaccine,Millions Of Doses Will Be Shipped Right Away,US FDA Authorizes Pfizer COVID-19 vaccine,Pfizer,COVID-19,COVID-19 vaccine,Coronavirus vaccine,Pfizer COVID-19 vaccine,Mango News,Mango News Telugu,FDA Approves Pfizer Covid-19 Vaccine,US,US FDA,US FDA Approves Pfizer Coronavirus Vaccine,US Allows Emergency COVID-19 Vaccine,Pfizer Vaccine Cleared In US,Coronavirus News Updates,Covid-19 Vaccine Latest News,Covid-19 Vaccine Latest Updates,COVID,FDA Approves Pfizer Vaccine For Emergency Use in US,US FDA Greenlights Pfizer Covid Vaccine For Emergency Use,US FDA authorizes Pfizer Covid-19 Vaccine For Emergency Use,US FDA Approves Pfizer Vaccine

కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావంతో విలవిలలాడుతున్న అగ్రరాజ్యం అమెరికా ప్రజలకు శుభవార్త అందింది. అమెరికా బయోటెక్ దిగ్గజ కంపెనీ ఫైజర్, జర్మన్ కి చెందిన బయోఎన్‌టెక్‌ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ ను‌ అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చింది. ఫైజర్ కరోనా వ్యాక్సిన్ కు ఎఫ్‌డీఏ ఆమోదం తెలపడంతో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. నవంబర్ 20వ తేదీన క్లినికల్ ట్రయల్స్ యొక్క పూర్తి నివేదికతో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఎఫ్‌డీఏకు ఫైజర్ దరఖాస్తు చేసుకుంది. ఫైజర్‌ సమర్పించిన నివేదికను ఎఫ్‌డీఏ ప్యానెల్ సుదీర్ఘంగా పరిశీలించి శుక్రవారం నాడు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు ఫైజర్ వ్యాక్సిన్ కు అమెరికాతో పాటుగా యునైటెడ్ కింగ్ డమ్, బహ్రైన్‌, కెనడా, సౌదీ అరేబియా, మెక్సికో దేశాలు అనుమతి ఇచ్చాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =