పదో రోజుకి చేరిన రైతుల ఆందోళన, పీఎం మోదీతో కేంద్రమంత్రుల భేటీ

Farmers Protest: Union Ministers Meet PM Modi Before The Discussion With Farmers,Farmers Protest,Union Ministers,Union Ministers Meet PM Modi,Narendra Modi,PM Narendra Modi,Prime Minister of India,Farmers,Agrarian Laws,Union Government,Farms Bill,Farmers Protest News,PM Modi,Amit Shah,Rajnath Singh,Narendra Tomar,Bharat Bandh,Mango News,Mango News Telugu,Union Ministers Meet PM Modi Ahead Of Talks With Farmers,Union Ministers Meet Modi,Centre Farmers Talks,Union Ministers Meet PM Modi Before The Discussion With Farmers,Farmers,Kisan Protest

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన పదో రోజుకి చేరుకుంది. రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు ఇప్పటికే రెండుసార్లు జరిపిన చర్చలు ఫలించలేదు. ఈ క్రమంలో చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను తీవ్రతరం చేయడంలో భాగంగా డిసెంబర్ 8 వ తేదీన భారత్ బంద్ కోసం రైతులు పిలుపునిచ్చారు. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం రెండుగంటలకు ఢిల్లీలో కేంద్రమంత్రులు, రైతుల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులతో సమావేశానికి ముందుగా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో రైతుల ఆందోళనకు సంబంధించి తాజా పరిస్థితులు, చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తునట్టుగా సమాచారం. ఈసారి చర్చల్లో కూడా తమ డిమాండ్లను నెరవేరకపోతే ఆందోళనన మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − ten =