‘ఆర్ఆర్ఆర్​’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ కాదు.. భారత్ తరఫున అధికారికంగా ‘ఆస్కార్’కు ఎంపికైన చిత్రం ఇదే!

Gujarati Film Chhello Show is India's Official Entry For The Oscar Awards 2023, Gujarati Film Chhello Show, Chhello Show, Chhello Show India's Official Entry For Oscars, Oscar Awards 2023, Gujarati Film The Chhello Show, The Last Film Show, Mango News, Mango News Telugu, The Last Film Show Entry For Oscars, Oscar Awards , Oscar Awards Latest News And Updates, RRR, The Kashmiri Files, The Cinema Paradiso, Chhello Show Freemake of Cinema Paradiso, Academy Award Winner Cinema Paradiso, Oscars 2023

ప్రపంచవ్యాప్తంగా సినిమాలకు సంబంధించి ప్రతి ఒక్కరి కల ‘ఆస్కార్ అవార్డు’ గెలుచుకోవడం, గెలుచుకోలేకపోయినా కనీసం దానికి నామినేట్ అవడం. అలాంటి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు ఈసారి భారత్ నుంచి రెండు సినిమాలు అధికారికంగా ఎంపికవుతాయని సినీ అభిమానులు భావిస్తూ వచ్చారు. అవి.. ‘ఆర్ఆర్ఆర్​’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాలు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలకు ముందునుంచే భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై ఘనవిజయం సాధించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందించబడింది. ఈ రెండు సినిమాలలో ఎదో ఒకటి తప్పనిసరిగా ఆస్కార్ అవార్డులకు దేశం తరపున అధికారికంగా ఎంపికవుతుందని ఎక్కువమంది భావించారు.

అయితే వారందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ అనూహ్యంగా ఒక గుజరాతీ సినిమాకు ఈ అవకాశం దక్కింది. 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి భారతదేశం నుంచి ‘ఛెల్లో షో’ ఎంపిక చేయబడింది. ఈ గుజరాతీ చిత్రానికి ‘పాన్ నలిన్’ దర్శకత్వం వహించారు. 2021 అక్టోబర్ 14వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలైంది. రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్​పై సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించారు. ఇక ఈ చిత్రంలో భవిన్ రాబారి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, దిపెన్ రావల్ మరియు పరేష్ మెహతా నటించారు. ఇది 2021లో ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. అలాగే అక్టోబర్ 2021లో, 66వ వల్లాడోలిడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఛెల్లో షో’ గోల్డెన్ స్పైక్‌ని కూడా గెలుచుకుంది. ఇంగ్లీష్ లో దీనిని ‘లాస్ట్ ఫిల్మ్ షో’గా పిలుస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా పలు సినిమాలను పరిశీలించిన జ్యూరీ సభ్యులు తుదకు ఈ చిత్రాన్ని ఎంపిక చేయడం విశేషం. సో.. సినిమా ఏదైనా మన భారతీయ చిత్రమే కాబట్టి ఈ ‘ఛెల్లో షో’ ఆస్కార్ అవార్డు గెలుచుకోవాలని ఆశిద్దాం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =