ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఫీజుపై కీలక నిర్ణయం

COVID-19, COVID-19 Treatment Charges, COVID-19 Treatment Charges in Private Hospitals, Tamil Nadu Breaking News, Tamil Nadu Corona Cases, Tamil Nadu Corona Deaths, Tamil Nadu Coronavirus, Tamil Nadu Coronavirus News, Tamil Nadu Coronavirus Updates, Tamil Nadu Government, Tamilanadu, Tamilanadu Govt, Tamilanadu Govt Caps on COVID-19 Treatment

దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుండడంతో పలు రాష్ట్రాల్లో కరోనా బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులు కరోనాకు చికిత్స అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఫీజుపై పరిమితి విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ) లో కరోనా చికిత్స ఫీజు రోజుకు రూ.15వేలకు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై బాధితుల నుండి ఇంతకంటే ఎక్కువ ఫీజు ఏ ఆసుపత్రులైన వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ఫీజులు ఎక్కువుగా వసూలు చేస్తున్నారంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే జనరల్‌ వార్డులలో కోవిడ్ లక్షణాలు లేని వారికీ మరియు తేలికపాటి లక్షణాలు కల్గిన వారికి గరిష్టంగా రూ.7,500 మాత్రమే వసూలు చేయాలనీ చెప్పారు. సౌకర్యాలు, ఇతర అంశాల ఆధారంగా ఆసుపత్రులను గ్రేడులుగా వర్గీకరించారు. గ్రేడ్ ఏ1 మరియు గ్రేడ్ ఏ2 ఆసుపత్రులలో రోజుకు గరిష్టంగా ఐసీయూలో రూ.15000, జనరల్‌ వార్డుకు రూ.7,500 వసూలు చేయాలని చెప్పారు. ఇక గ్రేడ్ ఏ3 మరియు ఏ4 పరిధిలోకి వచ్చే ఆసుపత్రులలో గరిష్టంగా ఐసీయూలో రూ.15000, జనరల్‌ వార్డుకు రూ.5,000 వసూలు చేసుకోవచ్చని ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − fifteen =