పింఛన్లు పెంపు, వయో పరిమితి 57 ఏండ్లకు తగ్గింపు

According To election manifesto KCR hikes pension amount in Telangana, CM KCR Hikes Pension Amount In Telangana, Govt. move to increase pensions, Mango News, Pension hike By Telangana Government, pension hike In Telangana, Pensions hiked as Telangana state Government promised, Telangana Political News

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో బుధవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది, ఈ సమావేశం దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు, ముఖ్యంగా నూతన పురపాలక చట్టం బిల్లు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పింఛన్ల పెంపు హామీ పై చర్చించారు. నూతన పురపాలక చట్టానికి సంబంధించిన బిల్లు పై సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు. 18, 19 వ తేదీలలో జరగబోయే శాసన సభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నారు.

అంతే కాకుండా వృద్ధాప్యపింఛన్ల వయో పరిమితిని 57 ఏళ్లకు తగ్గిస్తామని, గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు, దానికి కట్టుబడి హామీని అమలు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. 57 సంవత్సరాల వయసు ఉన్న పేదల జాబితాను వెంటనే తయారు చెయ్యాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు, దీంతో పాటు బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్ ను తొలగించాలని నిర్ణయించారు, ఈ రోజు వరకు పీఎఫ్ ఖాతా ఉన్నవారికి పింఛన్ అందించాలని సూచించారు. ఇప్పుడు వృద్ధులకు, వితంతువులుకు, బీడీ కార్మికులకు మరియు ఇతరులకు ఇస్తున్న వెయ్యి రూపాయల పింఛను ను, రూ. 2,016 కు పెంచారు. కొత్తగా పెంచిన డబ్బులను ఈ నెల 20 నుంచి అందివ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

 

[subscribe]
[youtube_video videoid=ofcQZs_hnZs]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 14 =