కాబుల్‌ విమానాశ్రయం వెలుపల వరుస పేలుళ్లు, 72 మంది మృతి

13 US military personnel killed in bomb attacks, 13 US military personnel killed in bomb attacks at Kabul airport, 73 people killed in blasts outside Kabul airport, Afghanistan LIVE updates, Afghanistan News LIVE, Afghanistan terror attack LIVE, At least 72 killed in Kabul airport attack, Atleast 72 People Including 12 US Troops Lost Lives, Blasts at Kabul airport, Civilian death toll in Kabul blasts rises to 72, ISIS-K claims responsibility for carnage at Kabul airport, Kabul airport, Kabul Airport Assult, Kabul airport attack kills 60 Afghans, Mango News

ఆఫ్ఘానిస్తాన్ దేశంలో రోజురోజుకి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గురువారం ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్‌ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కాబుల్ లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల రెండు చోట్ల పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లలో మొత్తం 72 మంది ప్రాణాలు కోల్పోగా, 150 మంది తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. వీరిలో అమెరికాకు చెందిన 11మంది మెరీన్ కమాండోస్, ఓ నేవీ వైద్యుడు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఇప్పటికే ఐఎస్ఐఎస్ గ్రూపు ప్రకటించింది. కాగా కాబూల్ లో జరిగిన పేలుళ్లపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ, తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ దాడులను మేము క్షమించము, మేము మరచిపోము, మేము మిమ్మల్ని వేటాడి మూల్యం చెల్లించేలా చేస్తామని జో బైడెన్ పేర్కొన్నారు. ఈ పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను జో బైడెన్ హీరోలుగా అభివర్ణించారు. మరోవైపు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కాబూల్ నుంచి అమెరికన్ల తరలింపు ప్రక్రియ ఆగదన్నారు. అలాగే ఆగస్టు 31 కల్లా ఆఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకుంటామని జో బైడెన్ మరోసారి స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 14 =