వదలని కోవిడ్ చీడ

Lungs Brain And Kidneys Are Damaged In Corona Victims,Lungs Brain And Kidneys Are Damaged,Damage In Corona Victims,Lungs Are Damaged In Corona,Mango News,Mango News Telugu,Lungs, Brain, Kidneys Are Damaged In Corona Victims, Corona,Effect Of Covid 19 On The Organs,Covid-19 Pathology In The Lung,Covid-19 Long Term Effects,Covid-19 Can Damage The Brain,Corona Victims Latest News,Corona Victims Latest Updates,Corona Victims Live News

ఇప్పుడు ఎవరి ఆరోగ్యం గురించి మాట్లాడినా.. కరోనాకు ముందు , కరోనాకు తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివాళ్లు కూడా ఇప్పుడు నిత్యం ఏదో కొత్త రకం ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో కరోనా బారిన పడి కోలుకున్నవాళ్లు కొత్తకొత్త ఆరోగ్య సమస్యలతో తరచూ సతమతమవుతున్నారు.

అవును ఆ సమయంలో కరోనా చికిత్స తీసుకుని కోలుకున్నవాళ్లు.. తర్వాత ఆరోగ్యం మెరుగయ్యాకమ వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తే..వారిలో అవయవాలు దెబ్బతింటున్నాయన్న విషయాన్నియునైటెడ్ కింగ్ డమ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

యూకేలో వివిధ యూనివర్సిటీల నుంచి కొంతమంది సైంటిస్టులు.. కరోనా నుంచి కోలుకున్న వారిపై ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. మొత్తం 2వేల మంది కోవిడ్ బాధితులపై సైంటిస్టులు పరిశోధనలు చేశారు. వారంతా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యాక.. 5 నెలల తర్వాత నుంచి రెండు నెలల క్రితం వరకూ వారి ఆరోగ్యాన్ని గమనిస్తూ.. వారి వారి ఎంఆర్‌ఐ స్కానింగ్‌ రిపోర్టులను జాగ్రత్తగా పరిశీలించారు. అయితే రిపోర్టులు చూసిన సైంటిస్టులు షాక్ అయ్యారు. వీరిలో 91 శాతం లాంగ్‌ కోవిడ్‌తో బాధపడుతున్నారని.. అందుకే వీరి శరీరంలోని కొన్ని ప్రధాన అవయవాలు మెల్లమెల్లగా పనిచేయడం ఆగిపోతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు.

ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో.. ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాలకు లాంగ్‌ కోవిడ్‌ ముప్పు మూడు రెట్లు ఎక్కువగా పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనిషిపై దాడి చేసిన కోవిడ్ వైరస్‌ తీవ్రతను బట్టి కూడా ఇప్పుడు ఆ మనుష్యులపై ముప్పు పెరుగుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు.కోవిడ్ సోకని వారితో పోలిస్తే.. కరోనా సోకిన వారి శరీరంలోని ప్రధాన అవయవాల్లో చాలా వ్యత్యాసాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. అన్నింటికంటే ఎక్కువగా ఊపరితిత్తులే ప్రభావితం అవుతున్నట్లు తేల్చారు. తర్వాత ముప్పు మెదడు, మూత్రపిండాలకు ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరిలో గుండె, కాలేయం పెద్దగా దెబ్బతినడం లేదని తేల్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − fifteen =