చంద్రుడి మీద కాలమానం కొలతలెలా?

How To Measure Time On The Moon,Time On The Moon,How To Measure Moon Time,Mango News,Mango News Telugu,Measure Time On The Moon,Moon,The Biggest Challenge, Space Scientists,Telling Time On The Moon,What Time Is It On The Moon,Time Zones On The Moon,Science Mission Directorate,Moon Time Latest News,Moon Time Latest Updates,Moon Time Live News

చంద్రయాన్‌ -3 విజయవంతమవడంతో చందమామపై మానవాళి పరిశోధనలో మరో ముందడుగు పడినట్లయింది. 2025 సంవత్సరానికి మనుషులు చంద్రుని మీద దిగే ప్రయత్నాలు స్పీడందుకున్నాయి. అంతేకాదు అక్కడ పరిశోధన కేంద్రాలను స్థాపించాలని ప్రణాళికలు కూడా తయారవుతున్నాయి. అయితే అక్కడ మనుషులు కాకుండా మరమనుషులను ఉంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆ రోబో యంత్రాలే అక్కడ తిరుగుతూ.. ఖనిజ వనరులను గురించి పరిశీలనలు, పరిశోధనలు కొనసాగించేలా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. అప్పుడప్పుడు అదనపు సమాచార సేకరణ కోసం మనుషులు అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంటే, భూమి మీద ఎలా ఓ సమయం ప్రకారం అన్నీ జరుగుతున్నాయో.. చంద్రుడి మీద కూడా జరిగే కార్యక్రమాలన్నీ ఒక కాల మానం ప్రకారం పద్ధతిగా జరగవలసిన అవసరం కనిపిస్తోంది. దీంతో చంద్రుని మీద కాలాన్ని లెక్కించడం ఎలా అనేది మానవాళి ముందున్న ముఖ్యమైన ప్రశ్నగా ఇప్పుడు నిలిచింది.

అపోలో వ్యోమగాములు గతంలో చంద్ర గోళం మీద దిగారు. తర్వాత వారు తమ పని తాము ముగించుకుని వచ్చేశారు. అప్పుడు వారికి కాలం కొలతలతో అవసరం పడలేదు. కానీ శాశ్వతంగా అక్కడి కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే మాత్రం, తప్పకుండా కాలం లెక్కలు అవసరమవుతాయి. భూమి మీద ఏదో ఒక ప్రాంతంలో ఉన్న పద్ధతిలోనే..చంద్రుని మీద సమయాన్ని కూా లెక్కించే పద్ధతిని అక్కడ అనుసరించవలసి వస్తుంది.అయితే ఈ మాట అనడానికి ఈజీగానే ఉన్నా… అటు సాంకేతిక పరంగా ఇది గొప్ప సమస్యగా మారనుంది.

అసలు చంద్రుడి మీద కాలం లెక్కకు ఆధారం ఏమిటనే అతి పెద్ద సమస్య శాస్త్రవేత్తల ముందు నిలబడింది. భూమి మీద ఒక సెకండ్‌ అంటే తెలుసు. కానీ దీనిని లెక్కపెట్టడానికి కూడా శాస్త్రవేత్తలు ఎంతోమంది తలలు బాదుకున్నారు. భూమి తన చుట్టు తాను తిరుగుతుంటే కాలం మనకు తెలుసు. అలాగే భూబి సూర్యుని చుట్టూ తిరిగే సమయం కూడా తెలుసు. వీటి ఆధారంగానే కాలం కొలతలను లెక్క గట్టారు. కానీ చంద్రుడి దగ్గరకు వచ్చేసరికి ఈ లెక్కలు సరిపోవు. ఎందుకంటే చంద్రుడు తన చుట్టూ తాను, భూమితో పోలిస్తే మాత్రం, చాలా నెమ్మదిగా తిరుగుతుంది. ఆ గోళం మీద కొంత ప్రాంతం వెలుగు కూడా లేకుండానే ఎక్కువ కాలం ఉండిపోతుంది. చంద్రుడు ఒకసారి తాను తన చుట్టూ తిరగడానికి 29.5 భూమి దినాలు పడుతుందని అంచనా. .

చంద్రుడు తిరుగుతున్నట్టు భూమి మీద మనకు కనిపించదు. ఎందుకంటే ఎప్పుడూ చంద్రుని మీది ఒక దిక్కు మాత్రమే మనకు కనపడుతుంది.అయితే చంద్రగోళం తను తిరుగుతున్న వేగంతోనే భూమి చుట్టూ తిరుగుతుంది.అందుకే ఎప్పుడూ ఆ గోళం మీద ఒక భాగం మాత్రమే మనకు కనబడుతుంది. మనకు భూమి మీద సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి కొలతలు, కాలమానాలు ఉన్నాయి. చంద్రుని మీద ఈ కొలతల లెక్కలు వేరుగా ఉంటాయి. అంటే చంద్రగోళం మీద కాలం కొలతలు అంత ఈజీగా లెక్కలు వేయలేము. అందుకే వాటి గురించి పరిశోధకులు ఇప్పటి నుంచీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

భారత దేశం నుంచే కాకుండా ఎన్నో దేశాల నుంచి చంద్రుడి మీదకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే వీరందరికీ ఏకాభిప్రాయం కుదిరే సమయం లెక్కలు ఇప్పుడు కావాలి. అక్కడికి వెళ్లిన యాత్రికులు,ఏ సమయంలో, ఏ ప్రదేశంలో ఎంతకాలం ఉన్నామన్న విషయాలను వాళ్లు లెక్క వేసుకోగలగాలి. భూమి మీద ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. చంద్రుని మీద కూడా ఇటువంటి కొలతల కోసం కావలసిన సాంకేతిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. మొత్తంగా చంద్రుని మీద కాలమానాన్ని ఎలా లెక్కలు కడతారో.. ఎన్ని సంవత్సరాలకు కడతారో అన్న విషయం చూడాలి మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 3 =