డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

Minister Errabelli Dayakar Rao Inaugurates Double Bedroom Houses

వరంగల్ రూరల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం మైలారం గ్రామంలో 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బుధవారం నాడు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రారంభించారు. సంక్రాంతి కానుకగా లబ్దిదారులకు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ, ముందుగా రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి వరంగల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణలోని నిరుపేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్లు ఖర్చు చేస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తున్నదని అన్నారు. గతంలో ఇళ్లు అగ్గి పెట్టెల్లా ఉండేవి. భార్య పిల్లలతో ఒక కుటుంబం ఉండాలంటే ఎంతో ఇబ్బందిగా ఉండేది. అలాగే నేరుగా నిధులు ఇవ్వడం వల్ల ఇళ్ల పథకంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. కొందరు దళారులు ఇళ్ల కుంభకోణానికి కూడా పాల్పడ్డారు. వీటన్నిటికీ ముగింపు పలుకుతూ నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉండాలని సీఎం కేసీఆర్ భావించారు. అందులో భాగంగా అర్హులైన నిరుపేదలకు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 17 =